13-04-2025 01:45:45 AM
ఘనంగా చిన్న హన్మాన్ జయంతి
లక్షలాదిగా తరలివచ్చిన దీక్షాపరులు, భక్తులు
జగిత్యాల, ఏప్రిల్ 12 (విజయక్రాంతి): జగిత్యాల జిల్లాలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు వద్ద చైత్ర పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని చిన్న హనుమాన్ జయంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 2 లక్షల మంది భక్తు లు ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. అంజన్న దీక్షపరులు హన్మాన్ చాలీసాలు, అంజనేయ దండకాలతో శుక్రవారం రాత్రి జాగరణ చేసి శనివారం ఉదయం వరకు భక్తి పారవశ్యంలో మునిగితేలారు. ఈ సందర్భంగా ఆలయంలోని అంజనేయస్వామి మూలవిరాట్టుకు పంచామృతాలతో అభిషేకాలు చేసి, పట్టువస్త్రాలతో అలంకరించారు. సహస్రనాగవల్లి అర్చన, తమలపాకులు, పండ్లతో ప్రత్యేక అర్చనలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి పాదయాత్రగా కొండగట్టుకు చేరుకున్న దీక్షపరులు, భక్తులు అత్యంత నియమ నిష్టలతో స్వామి దీక్షలను విరమించారు.