calender_icon.png 24 February, 2025 | 8:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మల్లన్న ఆలయంలో భక్తుల రద్దీ

24-02-2025 12:00:00 AM

 చేర్యాల, ఫిబ్రవరి 23: ప్రముఖ శైవ  క్షేత్రాలలో ఒకటైన కొమరవెల్లి మల్లికార్జున స్వామి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. బ్రహ్మోత్సవాలు ప్రారంభమై ఆరో వారం కావస్తున్న, భక్తుల రద్దీ మాత్రం కొనసాగుతుంది. భక్తులు తండోపతండ లుగా తరులొచ్చి స్వామివారి మొక్కులను  అత్యంత  భక్తిశ్రద్ధలతో చెల్లించుకున్నారు. స్వామి వారి దర్శనానికి సుమారు మూడు గంటలకు సమయం పట్టింది. భక్తులు ఆదివారం తెల్లవారుజామున లేచి కోనేట్లో స్నానాలు ఆచరించారు.

ఆలయ ద్వారం తెరవక ముందే, భక్తులు నాలుగు గంటల నుండే స్వామి వారి దర్శనార్థం క్యూ లైన్ లలో నిలుచున్నారు. స్వామి వారి ఆలయం ద్వారం తెరవగానే గర్భగుడిలో ఉన్న మల్లన్న ను దర్శనం చేసుకున్నారు. దర్శ  నానంతరం మొక్కుల్లో భాగంగా గంగారేం చెట్టు కింద మల్లికార్జున స్వామి కి బోనాలు నైవేద్యంగా సమర్పించి, పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకున్నారు. కొండపై నున్న ఎల్లమ్మ తల్లికి గజ్జెల లాగులతో, చేతిన వీరగోళలతో ప్రత్యేక నృత్యాల మధ్య శివసత్తులు ఊరేగింపుగా వెళ్లారు.

అనంతరం తల్లికి బోనం నైవేద్యంగా సమర్పించి, భక్తితో వేడుకున్నారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కుటుంబంతో సహా మల్లన్న స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు మహాదేవుని మల్లికార్జున్ ఆయనకు ఆశీర్వాచనములు ఇచ్చి, ప్రసాదాలు అందజేశారు. భక్తుల రద్దీకి తగ్గట్టుగా, ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ వర్గాలు ఏర్పాట్లు చేశారు. పాలకమండలి సభ్యులు లింగంపల్లి శ్రీనివాస్, అంజిరెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు.