20-02-2025 01:13:54 AM
నాలుగో రోజూ అదే జోరు
పెద్దగట్టుకు భారీగా తరలివచ్చిన భక్తులు
లింగమంతుల స్వామి, చౌడమ్మ తల్లికి నైవేద్యంగా బోనం చెల్లింపు
కేసారం తరలిన దేవరపెట్టె
నేడు మకరతోరణం తరలింపుతో జాతర పరిసమాప్తం
సూర్యాపేట, ఫిబ్రవరి19(విజయక్రాంతి): దురాజ్ పల్లిలోని శ్రీ లింగమంతుల స్వామి (గొల్లగట్టు) జాతరకు నాలుగో రోజూ భక్తులు భారీగా తరలివచ్చారు. నెలవారం కార్యక్రమాన్ని మున్న, మెంతబోయిన వంశస్తులు సంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. లింగమంతుల స్వామి, చౌడమ్మ తల్లికి బోనం వండి నైవేద్యంగా సమర్పించారు. అనంతరం దేవరపెట్టెను కేసారం గ్రామానికి తరలించి దేవరగుడిలో పెట్టి పూజలు చేశారు.
ఉదయం మందకొండిగా.. సాయంత్రానికి కిటకిట..
నాలుగు రోజులుగా సాగుతున్న జాతరలో సోమవారం మినహా మిగతా రోజుల్లో ఉదయం భక్తుల రద్దీ తక్కువగా ఉంటూ జాతర పరిసర ప్రాంతాలు వెలవెలబోతు న్నాయి. మధ్యాహ్నానికి పుంజుకొని రాత్రికి భక్తు లతో ఆలయ ప్రాంతాలు కిటకిట లాడుతు న్నాయి. ఈ రద్దీతో జాతీయ రహదారిపై కూడా ట్రాఫిక్ స్తంభించి పోతుంది. వ్యాపారాలు కూడా సాయంత్రం బాగా సాగుతున్నాయి.