calender_icon.png 28 November, 2024 | 8:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టెక్కీలకు భారీ డిమాండ్

28-11-2024 12:00:00 AM

  1. వచ్చే ఆరు నెలల్లో ఐటీ నియామకాల్లో 12 శాతం వృద్ధి
  2. క్వెస్ కార్ప్ రిపోర్ట్

హైదరాబాద్, నవంబర్ 27: కొత్త టెక్నాలజీల ఆవిర్భావంతో ప్రపంచ వ్యాప్తంగా పరిశ్రమలు, ఆర్థిక వ్యవస్థల రూపు మారుతున్నదని, ఈ నేపథ్యంలో ఐటీ సర్వీసుల్లో నియమకాలు వచ్చే ఆరు నెలల్లో 10-12 శాతం పెరుగుతాయని బిజినెస్ సర్వీసెస్ ప్రొవైడర్ క్వెస్ కార్ప్ తాజా నివేదికలో పేర్కొంది.

జెనరేటివ్ ఏఐ, డీప్‌టెక్, క్వాంట మ్ కంప్యూటింగ్ విభాగాల్లో 2030క ల్లా దేశంలో 10 లక్షల కొత్త ఉద్యోగాల సృష్టి జరుగుతుందని తెలిపింది. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీలు), సైబర్ సెక్యూరిటీల్లో ఈ ద్వితీయ త్రైమాసికంలో (జూలై-సెప్టెంబర్) అంతక్రితం మూడు నెలలకంటే హైరింగ్ 71 శాతం, 58 శాతం చొప్పున పెరిగిందని క్వెస్ కార్ప్ ఐటీ స్టాఫింగ్ సీఈవో కపిల్ జోషి వెల్లడించారు.

క్యూ2తో ఈఆర్‌పీ, టెస్టింగ్, నెట్‌వర్కింగ్, డాటా సైన్స్ స్కిల్ సూట్స్‌లో నిపుణులకు డిమాండ్ 79 శాతం వృద్ధిచెందిందని తెలిపారు. ఈ స్కిల్ సూట్స్‌కు తోడు జావా (30 శాతం), సైబర్ సెక్యూరిటీ (20 శాతం), డెవ్‌ఓప్స్‌కు (25 శాతం) సంబంధించిన నిపుణులకు డిమాండ్ వేగంగా పెరిగిందని క్వెస్ కార్ప్ వివరించింది.

వివిధ రంగాల్లో టెక్కీల నియామకాల్ని వెల్లడిస్తూ అత్యధికంగా ఐటీ సర్వీసుల కంపెనీల్లో నిపుణులకు డిమాండ్ 37 శాతం పెరగ్గా, హైటెక్‌లో 11 శాతం, కన్సల్టింగ్‌లో 11 శాతం, మాన్యుఫాక్చరింగ్‌లో 9 శాతం, బీఎఫ్‌ఎస్‌ఐ సంస్థల్లో 8 శాతం చొప్పున వృద్ధిచెందిందని పేర్కొంది. 

హైదరాబాద్‌లో 43.౫ శాతం వృద్ధి

నగరాల వారీగా చూస్తే ఐటీ నిపుణులకు డిమాండ్  తొలి త్రైమాసికంకంటే ద్వితీయ త్రైమాసికంలో అత్యధికంగా బెంగళూరులో 62 శాతం డిమాండ్ పెరిగిందని,  హైదరాబాద్‌లో 43.5 శాతం, పూణేలో 10 శాతం డిమాండ్ వృద్ధిచెందిందని రిపోర్ట్ పేర్కొంది.

జీసీసీలో నెలకొన్న కంపెనీలు ఈటీఇంజనీరింగ్, ఐటీ, ఫైనాన్స్, అనలిటిక్స్ విభాగాల్లో నిపుణుల కోసం అన్వేషిస్తున్నాయని, టైర్ టూ, టైర్ త్రీ నగరాల్లో నియా మకాలు జరపాలని చూస్తున్నట్లు క్వెస్ కార్ప్ వివరించింది.