calender_icon.png 12 January, 2025 | 6:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బంగారం రుణాలకు భారీ డిమాండ్

01-12-2024 12:00:00 AM

బ్యాంక్‌ల్లో 50 శాతం పెరిగాయంటున్న ఆర్బీఐ

న్యూఢిల్లీ, నవంబర్ 30: బ్యాంక్‌ల్లో బంగారం రుణాలకు డిమాండ్ భారీగా పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఏడు నెలల్లో బ్యాంక్‌లు ఇచ్చిన బంగారం తనఖా రుణాలు 50.4 శాతం వృద్ధిచెందాయని రిజర్వ్‌బ్యాంక్ వెల్లడించింది. అక్టోబర్ చివరి నాటికి బ్యాంక్‌లు ఇచ్చిన బంగారం రుణాల మొత్తం రూ.1,54,282 కోట్లు ఉన్నది. 2024 మార్చినాటికి రూ.1,02,562 కోట్లు గా ఉన్న ఈ రుణాలు ఏకంగా 50 శాతం పెరగడం గమనార్హం. 

కారణాలివి..

బ్యాంక్‌ల్లో బంగారు ఆభరణాలు తనఖాచేసి పొందే రుణాలు భారీగా పెరగడానికి పలు కారణాలున్నాయని బ్యాంకర్లు చెపుతున్నారు. ఖాతాదారులు వారి బంగారం రుణాల్ని నాన్ ఫైనాన్స్ కంపెనీల (ఎన్‌బీఎఫ్‌సీలు) నుంచి బ్యాంక్‌లకు మళ్లించడం, పర్సనల్ లోన్స్ వంటి ఇతర ఆన్‌సెక్యూర్డ్ రుణాలకు బదులు సెక్యూర్డ్ రుణాలు తీసుకునేందుకు ఖాతాదారులు మొగ్గుచూపిస్తున్నందున, బ్యాంక్‌ల్లో గోల్డ్ లోన్స్‌కు డిమాండ్ పెరుగుతున్నదని అంటున్నారు.

ఈ ఏడు నెలలకాలంలో ఎన్‌బీ ఎఫ్‌సీల వద్దనున్న గోల్డ్‌లోన్ బుక్ 0.7 శా తం క్షీణించి రూ.1.5 లక్షల కోట్లకు తగ్గింది. ఈ ఏడు నెలల్లో ఇతర వ్యక్తిగత రుణాల వృద్ధి రేటు కూడా సింగిల్ డిజిట్‌లోనే ఉన్నది. బంగారం ధరలు పెరగడంతో కూ డా ఈ రుణాలకు డిమాండ్ వృద్ధిచెందుతున్నదని బ్యాంకర్లు వ్యాఖ్యానిస్తున్నారు. తక్కు వ విలువపై తీసుకున్న పాత రుణాల్ని చెల్లిం చి, అధిక విలువపై ఎక్కువ రుణ మొత్తాన్ని తీసుకుంటున్నారని వారు వివరించారు.