calender_icon.png 27 November, 2024 | 3:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీ పదవులకు భారీ డిమాండ్

27-11-2024 12:57:57 AM

  1. త్వరలో భర్తీ కానున్న మండల, జిల్లాస్థాయి అధ్యక్ష పదవులు
  2. ఆ తర్వాత రాష్ట్ర అధ్యక్ష పదవి
  3. కమలానికి ఛరిష్మా పెరిగిన నేపథ్యంలో పదవులపై నేతల్లో ఆశలు

హైదరాబాద్, నవంబర్ 26 (విజయక్రాంతి) : గత పార్లమెంట్ ఎన్నికలు తెలంగా ణలో బీజేపీకి ఎక్కడలేని బలాన్నిచ్చాయి. రాష్ట్రంలో ఏకంగా సగం ఎంపీ సీట్లను సా ధించడంతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలకు కొత్త ఉత్సాహం వచ్చింది. ఒకప్పుడు పార్టీపై అభిమానం ఉన్నవారిని బీజేపీ జిల్లా అధ్యక్షు డిగా నియమించే పరిస్థితి ఉండేది.

ఆయన వల్ల పార్టీకి పెద్దగా ప్రయోజనం లేకున్నా కనీసం అక్కడ తమ ప్రతినిధి ఉంటే చాలనే విధంగా పార్టీ నేతలు భావించేవారు. ఈ పరి స్థితి దాదాపుగా  2019 వరకు కొనసాగింది. ఇప్పటి పరిస్థితి వేరు. కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారంలోకి రావడంతో పాటు రాష్ట్రంలో బీజేపీకి ఊహించని విధం గా వచ్చిన ఎంపీ సీట్లు పార్టీ స్థాయిని నెక్స్ లెవల్‌కు తీసుకుపోయాయి.

దీంతో ఇప్పు డు బీజేపీలో ఒక పదవి ఉంటే చాలు అనే విధంగా పరిస్థితులు  మారాయి. అందుకే మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు సైతం బీజేపీ జిల్లా అధ్యక్ష పదవికి పోటీదారులుగా మారిపోయారనే చర్చ నడుస్తోంది. బీజేపీ జిల్లా అధ్యక్షునిగా ఉంటే పార్టీ ముఖ్య నేతలతో నేరుగా టచ్‌లో ఉండి, రాబోయే అసెం బ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం పొందవచ్చని చాలా మంది భావిస్తున్నట్లుగా సమాచారం.

అందుకే బీజేపీ సంస్థాగత ఎన్నికల్లో తాము అవకాశం దక్కించుకోవా లనే తీరు బాగా కనిపిస్తోంది. డిసెంబర్ నెలలో భర్తీ కానున్న మండల, జిల్లా పదవుల కోసం పార్టీ నేతలు అన్ని రకాల ప్రయ త్నాలు ప్రారంభించారు.

అప్పుడలా.. ఇప్పుడిలా..

రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో తెలంగాణ ఏర్పాటుకు సహకరించిన బీజేపీకి 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కేవలం ఒక్కటంటే ఒక్కటే ఎంపీ సీటు లభించింది. అయితే 2019లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఊహించని విధంగా 4 ఎంపీ సీట్లు సాధించి సత్తా చాటింది. అప్పటి నుంచి రాజకీయంగా ఎదగాలనుకునేవారు బీజేపీపైనా ఓ కన్నేసి ఉంచారు.

ఆ తర్వాత 2024 కు వచ్చేవరకు తెలంగాణలో బీజేపీ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఏకంగా 8 ఎంపీ సీట్లతో సత్తా చాటింది. మరికొన్ని చోట్ల గెలుపునకు దగ్గరగా వచ్చింది. కొన్ని చోట్ల అభ్య ర్థుల ఎంపిక సరిగా లేక విజయాన్ని అందుకోలేదని బీజేపీ నాయకత్వం గుర్తించింది. అంటే సరిగ్గా దృష్టి పెట్టి ఉంటే డబుల్ డిజిట్ పక్కాగా దాటేదని ఆ పార్టీ నేతలు భావించా రు.

2009లో ఉమ్మడి రాష్ట్రంలో బీజేపీ ఒక్కటంటే ఒక్క సీటు సాధించలేదు. కానీ ఆ తర్వాత క్రమంగా పుంజుకుని ఎగబాకింది. ఇప్పుడు ఈ సమీకరణాలన్నింటినీ ఔత్సాహిక రాజకీయ నేతలు బాగా గమనిస్తు న్నారు. రాజకీయంగా ఎదగాలంటే బీజేపీ లాంటి పార్టీతోనే సాధ్యమనే ఆలోచన చాలా మందిలో కనిపిస్తోంది. 

రాష్ట్ర అధ్యక్ష పదవికి ఊహించని డిమాండ్..

ఒకప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి  పెద్దగా డిమాండ్ ఉండేది కాదు. బీజేపీ అధ్యక్షుడి ఎంపిక అనేది సాధారణ విషయంగా ఉండేది. ఎవరు కాబోయే అధ్యక్షుడో కూడా ఊహించే పరిస్థితి ఉండేది. కానీ 2024 పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీ అధ్యక్ష పద వికి ఊహించని డిమాండ్ ఏర్పడింది. అం దుకే పార్టీ అధిష్ఠానం సైతం ఆచితూచి అడుగులు వేస్తోంది.

ఎవరికి పదవిని అప్పగిస్తే బాగుంటుందనే దానిపై విస్తృతంగా కసరత్తు చేస్తోంది. సామాజిక అంశాలను సైతం పరిగణనలోకి తీసుకుంటోంది. మండల, జిల్లా స్థాయి పదవుల ఎన్నిక పూర్తయిన తర్వాత కొత్త ఏడాదిలోపు బీజేపీ అధ్యక్షుని నియామకం పూర్తవుతుందని పార్టీ నేతలు చెబు తున్నారు.

అందుకే పలువురు ముఖ్య నేతలు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ఢిల్లీ స్థాయి లో పైరవీలు చేస్తున్నారని వినిపిస్తోంది. ఏది ఏమైనా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలనే సంక ల్పంతో ఓవైపు కేంద్ర పార్టీ కసరత్తు చేస్తోం టే.. మరోవైపు బీజేపీలో సంస్థాగత పదవుల కోసం పార్టీ నేతలు గల్లీ నుంచి ఢిల్లీ వరకు పైరవీలు చేస్తున్నారు.

కమలానికి ఛరిష్మా భారీగా పెరిగిన నేపథ్యంలో పార్టీ పదవుల కోసం ఎక్కడాలేని డిమాండ్ వచ్చిందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. అయితే బీజేపీలో పదవులు అంత ఈజీగా రావని పార్టీ కోసం కష్టపడుతున్న వారికి, వారి స్థాయిని బట్టి  అవకాశం ఇస్తుందని పార్టీకి చెందిన ముఖ్యనేత ఒకరు విజయక్రాంతికి తెలిపారు.

బీజేపీలోనే అవకాశాలు ఎక్కువ..

ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ లో నేతలకు కొదవలేదు. కాబట్టి అక్కడ కొత్తగా రాజకీయంగా ఎదగాలనుకునే వారికి దాదాపుగా తలుపులు మూసుకుపోయాయి. ఇక బీఆర్‌ఎస్‌లో సైతం అదే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. గత పదేళ్లుగా అధికారంలో ఉన్న ఆ పార్టీలో ఇప్పటికే మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, వివిధ కార్పోరేషన్ల మాజీ చైర్మన్లు నియోజకవర్గాలను అట్టిపెట్టుకునే ఉన్నారు.

కానీ ఒక్క బీజేపీలో మాత్రం చాలా నియోజకవర్గాల్లో కొత్త నేతలకు అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందుకే చాలా మంది ఔత్సా హికులు బీజేపీని నమ్ముకుని రాజకీయంగా ముందుకు వెళ్లేందుకు ప్రయ త్నాలు ప్రారంభిస్తున్నారు. వారికి జిల్లా అధ్యక్ష పదవులు, రాష్ట్ర స్థాయి సంస్థాగత పదవులు అనేవి ఓ అవకాశంగా కనిపిస్తున్నాయి. అందుకే ఈ పదవులకు ఎక్కడ లేని డిమాండ్ నెలకొని ఉందని పార్టీకి చెందిన ఓ ముఖ్య నేత చెబుతున్నారు.