calender_icon.png 29 April, 2025 | 11:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రజతోత్సవ సభకు భారీగా తరలిన శ్రేణులు

28-04-2025 02:10:22 AM

కరీంనగర్, ఏప్రిల్ 27 (విజయ క్రాంతి): హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి లో నిర్వహిస్తున్న బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు బీఆర్‌ఎస్ శ్రేణులు ఆదివారం భారీగా తరలి వెళ్లాయి. బీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పార్టీ పతా కాన్ని ఆవిష్కరించారు.

అలాగే చింతకుంట లోని పార్టీ కార్యాలయంలో బీఆర్‌ఎ స్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం  ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి రజతోత్సవ సభకు బీ ఆర్‌ఎస్ శ్రేణులు ర్యాలీగా బస్సుల్లో బయలుదేరి వెళ్లారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పార్టీ పతాకాన్ని చేతబూని బస్సు పై కూర్చుని ర్యాలీగా రజతోత్సవ సభకు బయలుదేరారు.

  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పండుగ వాతావరణం లో సభకు తరలి వెళ్తున్నామని, ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారని అన్నారు. తెలంగాణ ఇంటి పార్టీ బిఆర్‌ఎస్ పార్టీ అని, కరీంనగర్ నియోజకవర్గం నుండి  సుమారు 300 బస్సులలో  ప్రజలు జాతర లాగా సభకు తరలివస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, బి ఆర్ ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరి శంకర్, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.