calender_icon.png 24 January, 2025 | 12:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటి సమీపంలో భారీ మొసలి

23-01-2025 12:19:42 AM

వనపర్తి, జనవరి 22 (విజయక్రాంతి)/పెబ్బేర్: వనపర్తి జిల్లా పెబ్బేర్ మండలం అయ్యవారిపల్లిలో బుధవారం ఓ ఇంటి ఆవరణలోని చెట్ల పొదల్లో దాదాపు 11 అడుగు ల పొడవు, 230 కిలోల బరువు గల భారీ మొసలి లభ్యమైంది. గ్రామంలోని కోమటోళ్లకుంట సమీపంలో గల ఓ ఇంటి ఆవరణ లోని చెట్ల పొదల్లో ఉన్న మొసలిని గమనించిన స్థానికులు ప్రాణభయంతో వణికి పో యారు.

సాగర్ స్నేక్ సొసైటీ వ్యవస్థాపకుడు కృష్ణసాగర్‌కు సమాచారాన్ని అందించారు. కృష్ణసాగర్ తన బృందంతో కలిసి వెళ్లి దాదాపు మూడు గంటల పాటు శ్రమించి మొసలిని బంధించారు. అనంతరం పంచాయతి కార్యదర్శి స్వాతి, కృష్ణసాగర్ బృందం అటవీ శాఖ అధికారిణి రాణికి అందజేశారు.