27-03-2025 12:04:16 AM
ఫైల్ పాస్ చేసేందుకు రూ.కోట్లు తీసుకుంటున్నారు..
ఎమ్మెల్యే రాజాసింగ్
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 26(విజయక్రాంతి) : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అవినీతికి అడ్డాగా మారిపోయిందని గోషామహల్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం భద్రాచలంలో కూలిపోయిన ఆరు అంతస్తుల భవనం ఘటనపై ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భధ్రాచలంతో పాటు రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో అక్రమ కట్టడాలు జరుగుతున్నాయన్నారు. తక్కువ రేట్‌లో ల్యాండ్ తీసుకుని 2,3,4 అంతస్తులకు అనుమతులు తీసుకుని, 5, 10 అంతస్తులను నిర్మిస్తున్నారని ఆరోపించారు. ఫైల్‌మూవ్ చేసేందుకు రూ.కోట్లు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. కమిషనర్, జోనల్ కమిషనర్, సీసీపీకి ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా స్పందించడంలేదని విమర్శించారు.
వారి కింది అధికారులు రూ. లక్షల్లో వసూలు చేస్తున్నారని ఆరోపించారు. సీసీపీ, కమిషనర్‌కు వాటాలు పోతున్నాయేమోనని అనుమానం వ్యక్తం చేశారు. తన నియోజకవర్గంలో అనుమతి లేని నిర్మాణాలు జరుగుతున్నాయని, 20, 40 అంతస్తుల భవనాలకు అనుమతులిస్తున్నారన్నారు. డబ్బులు తిని అనుమతిస్తు న్నారని, అనుమతికి ముందు స్థానికులకు ఏవైనా ఇబ్బందులున్నాయా, డ్రైనేజీ సౌక ర్యం ఉందా అనే విషయాన్ని పరిశీలించడంలేదని ఆరోపించారు. జీహెచ్ ఎంసీ అధికా రుల్లో అవినీతి అధికారులపై దర్యాప్తు చేసి ఉద్యో గం నుంచి తొలగిస్తే భయం ఉంటుందని మున్సిపల్ శాఖమంత్రి, సీఎం రేవంత్‌రెడ్డికి సూచించారు. ప్రజా సమస్యలపై ప్రజల తరఫున తాము ఫిర్యాదు చేస్తే వాటిని చెత్త కుప్పలో పడేస్తున్నారని విమర్శించారు. మున్సిపల్ అధికారులకు భారీ మొత్తంలో వచ్చే డబ్బుల వల్లే అనుమతి లేని నిర్మాణాలపై చర్యలు తీసుకోవడం లేదని చెప్పారు.