దేశీయ స్టాక్ మార్కెట్లో రెండు రోజులుగా నికర పెట్టుబడులు పెడుతున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) గురువారం ఒక్కసారిగా కొనుగోళ్ల జోరు పెంచారు. రూ. 8,539 కోట్ల విలువైన షేర్లను నికరంగా కొన్నట్లు స్టాక్ ఎక్సేంజీల తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గత రెండు రోజుల్లో రూ.5,300 కోట్లు ఇన్వెస్ట్‌చేయడంతో వరుస మూడు రోజుల్లో ఎఫ్‌పీఐల నికర పెట్టుబడులు రూ.13,000 కోట్లను మించాయి.