14-04-2025 01:14:42 AM
- కొనసాగుతున్న సహాయక చర్యలు
నాగర్ కర్నూల్ ఏప్రిల్ 13 (విజయక్రాంతి): శ్రీశైలం ఎడమ గట్టు కాలువ ఎస్‌ఎల్బిసి సొరంగంలో జరిగిన ప్రమాద ఘటన ప్రదేశంలో జారిపడిన భారీ బండరాలను రెస్క్యూ టీం బృందాలు జెసిబిల సాయంతో చిన్నవిగా చేసి లోకో ట్రైన్ ద్వారా బయటికి తోడేస్తున్నారు. ప్రమాదం జరిగి సుమారు 51 రోజులు గడుస్తున్నా కేవలం ఇద్దరిని మాత్రమే గుర్తించి వారి కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగించారు.
మిగిలిన అరుగురు కార్మికుల ఆచూకీ కోసం టన్నెల్ లో నిర్విరామంగా సహాయక చర్యలు చేపడుతున్నట్లు ప్రత్యేక అధికారి శివశంకర్ లోతేటి పేర్కొన్నారు. నీటి ఊట బురద పేరుకుపోతుండడంతో అదేపనిగా డి వాటరింగ్ బురద తోడివేత, టిబిఎం యంత్రం కటింగ్ బయటికి తరలింపు వంటి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. అందుకు అనుకూలంగా కన్వేయర్ బెల్ట్ కూడా పొడిగించినట్లు పేర్కొన్నారు.