calender_icon.png 26 February, 2025 | 8:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజల ఆర్జీలను సత్వరమే పరిష్కరించాలి

18-02-2025 12:00:00 AM

ప్రజావాణికి 69 దరఖాస్తులు

ఆదిలాబాద్, ఫిబ్రవరి 17 (విజయక్రాంతి) : ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి లో ప్రజలు ఎంతో నమ్మకంతో అందిస్తున్న ఆర్జీలను అధికారులు సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ వివిధ  మండలాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు.ఈ సందర్భంగా ఈ సోమవారం ప్రజావాణి లో 69 దరఖాస్తులు వివిధ రకాల సమస్యల పై వచ్చాయని తెలిపారు. వివిధ శాఖలకు సంబంధించి పంచాయితీ, విద్యుత్, వ్యవసాయం, విద్యా, వైద్యం, మహిళా శిశు సంక్షేమ శాఖ, మున్సిపల్, రెవెన్యు, తదితర శాఖలకు సంబంధించిన దరఖాస్తులను సంబంధిత అధికారులకు అందిస్తూ దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు. ఈ ప్రజావాణిలో రెవెన్యు డివిజన్ అధికారి వినోద్ కుమార్, ఆయా శాఖల జిల్లా అధికారులు, రెవెన్యు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.