19-04-2025 01:08:06 AM
6లక్షల విలువచేసే 12 కిలోల గంజాయి ప్యాకెట్లను స్వాధీనంచేసుకున్న రైల్వే పోలీసులు
శేరిలింగంపల్లి, ఏప్రిల్ 18, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో గంజాయిపై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతు న్నా.. గంజాయి ముఠాల కు చెక్ పడడం లేదు.ప్రతిరోజు ఎక్కడో చోట గంజాయి ము ఠా పోలీసులకు కంటపడకుండా గుట్టు గా సరఫరాకు తెరలేపుతున్నారు. తాజాగా శుక్రవారం ఉదయం లింగంపల్లి రైల్వే స్టేషన్ కో ణర్క్ ఎక్స్ ప్రెస్ లో పోలీసులు రోజూవారి తనిఖీల్లో చేపట్టగా...
గంజాయి ఉన్న బ్యాగు ను గుర్తించారు. ఆ బ్యాగు ను తనిఖీ చేసి రూ.6లక్షల విలువచేసే 13 ప్యాకెట్లతో కూడి న 12 కిలోల గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే బ్యాగును రైలులో ఎవరు పెట్టారు, ఎక్కడికి తీసుకువెళ్తున్నారు అనే కోణంలో రైల్వే పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.