calender_icon.png 24 December, 2024 | 10:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం

24-12-2024 12:36:03 AM

పోలీసులే లక్ష్యంగా మావోయిస్టుల దుశ్చర్య

తప్పిన పెను ప్రమాదం

చర్ల, డిసెంబర్ 23: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం సరిహద్దు రాష్ట్రమైన చత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లా కచ్చపాల్ మధ్య కొండపై 15 ఐఈడీలను పోలీసులు స్వాధీనం చేసుకుని, ధ్వంసం చేశారు. రెండు రోజుల క్రితం ఇదే స్థలంలో జరిగిన పేలుడులో ఇద్దరు డీఆర్‌జీ సైనికులు గాయపడ్డ విషయం తెలిసిందే. నారాయణపూర్‌లో మావోయిస్టు వ్యతిరేక ప్రచారం నిరంతరంగా నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలో క్యాంప్ కచ్చపాల్ నుంచి డీఆర్‌జి, బీఎస్‌ఎప్ 135 వరకు కార్ప్స్ సంయుక్త బృందం యాంటీ నక్సల్ ఆపరేషన్ కోసం టోకే ముస్సార్ గ్రామానికి వెళ్లారు. ఈ క్రమంలో కచ్చపాల్ ప్రాంతంలో జరిపిన సోదాల్లో భద్రతా బలగాలు టోకే కొండల్లో 15 ఐఈడీలను స్వాధీనం చేసుకున్నాయి. సైనికులకు హాని కలిగించేందుకు మావోయిస్టులు ఐఈడీ మందు పాత్రలు అమర్చారు. బీడీఎస్ బృందం ఐఈడీని జాగ్రత్తగా నిర్వీర్యం చేసింది. 15 ఐఈడీలు ఒక్కొక్కటి సుమారు 5 కిలోల బరువున్నాయని పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. ఆ ప్రాంతంలో పేలుడు పదార్థాల అవశేషాలు, విద్యుత్తు తీగలు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఐఈడీని పోలీసులు కనిపెట్టకుంటే భారీ నష్టం సంభవించేది.