జింబాబ్వేపై 232 పరుగులతో
శనివారం మూడో వన్డే
హరారే: జింబాబ్వేతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో అఫ్గానిస్థాన్ శుభారంభం చేసింది. తొలి వన్డే వర్షంతో రద్దు కాగా రెండో వన్డే లో మాత్రం భారీ విజయాన్ని అందుకుంది. గురువారం హరారే వేదికగా జరిగిన రెండో వన్డేలో ఆఫ్గన్ జట్టు 232 పరుగుల తేడాతో జింబాబ్వేపై గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది. ఓపెనర్ సెదికుల్లా అటల్ (104) సెంచరీతో మెరవగా.. మరో ఓపెనర్ అబ్దుల్ మాలిక్ (84) అర్థశతకంతో రాణించాడు. జింబాబ్వే బౌలర్లలో న్యూమన్ నాముర్హి 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో జింబాబ్వే 17.5 ఓవర్లలో 54 పరుగులకే కుప్పకూలింది. ఆఫ్గన్ బౌలర్లలో గజన్‌ఫర్, నవీద్ చెరో 3 వికెట్లతో రాణించారు.