20-03-2025 10:36:07 PM
జుక్కల్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం రాత్రి జుక్కల్ మండలంలోని బంగార్పల్లి, కేమ్రాజ్ కల్లాలీ, వజ్రఖండి, ఖండేబల్లూర్, సవర్గావ్, దోస్తపల్లి, పెద్ద ఎడిగి, చండేగావ్ గ్రామాలకి చెందిన బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జుక్కల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావుకు మద్దతుగా, ప్రజా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధికి ఆకర్షితులై పార్టీలో చేరినట్లు వారు తెలిపారు.