18-04-2025 09:50:17 PM
పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కృషి చేస్తాము
సిపిఐ పార్టీలో భారీ చేరికలు
సీపీఐ జాతీయ సమితి సభ్యులు పల్ల వెంకట్ రెడ్డి,ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
మునుగోడు,(విజయక్రాంతి): అణగారిన వర్గాల అభివృద్ధి లక్ష్యంగా కష్టజీవుల కోసం అనేక ప్రజా ఉద్యమాలు నిర్మించిన పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ అని సీపీఐ జాతీయ సమితి సభ్యులు పల్ల వెంకట్ రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పేర్కొన్నారు. సిపిఐ ప్రజా పోరాటాలకు ఆకర్షితులై మునుగోడు మండలంలోని కిష్టాపురం, చీకటి మామిడి, రావి గూడెం గ్రామాలకు చెందిన సుమారు 50 మంది యువకులకు కండువాలు కప్పి సిపిఐ పార్టీలోకి ఆహ్వానించి మాట్లాడారు. కార్మికుల కర్షకుల హక్కుల కోసం 100 సంవత్సరాల కాలంగా పోరాడిన చరిత్ర సిపిఐదని గుర్తు చేశారు. గ్రామీణ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం సిపిఐ పాటుపడుతుందని అన్నారు. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి సాగు త్రాగునీరు అందించేంతవరకు కృషి చేస్తానని ఈ సందర్భంగా అన్నారు.