calender_icon.png 21 January, 2025 | 4:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైడ్రాతో హడల్‌

26-08-2024 02:42:38 AM

భూకబ్జాదారుల్లో గుబులు

నాగర్‌కర్నూల్, ఆగస్టు 25 (విజయక్రాంతి): హైడ్రా పేరు వింటేనే నాగర్ కర్నూల్ జిల్లాలో రియల్టర్లు, భూకబ్జాదారుల్లో వ ణుకు మొదలైంది. నాగర్‌కర్నూల్ జిల్లా కేం ద్రంగా మారడంతో రియల్ ఎస్టేట్ వ్యాపార ం జోరందుకుంది. దీంతో కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్, నాగర్‌కర్నూల్ ప్రాంతాల్లో ని చెరువులు, కుంటలను కబ్జా చేశారు. వా టిని వెంచర్లుగా మార్చి సామాన్యులకు విక్రయించి భూకబ్జాదారులు కోట్లు సంపాదిం చారు. శిఖం భూములను సైతం ఆక్రమించుకుని స్విమ్మింగ్‌పూల్స్, విలాసవంతమైన భ వనాలు నిర్మించుకున్నారు. చెరువులోకి వ్య ర్థాలను మళ్లించి నీటి కాలుష్యానికి తెరలేపారు. రైతులకు సాగునీరందించే చెరువుల సా మర్థ్యం తగ్గడంతో పాటు కలుషిత నీటితో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు.

గతంలో కొందరు ప్రజాప్రతినిధులు చెరువు లు కబ్జాలు చేసి అక్రమ రిజిస్ట్రేషన్లతో కోట్లు వెనకేసుకున్నారు. ఈ కబ్జాపై పలువురు మేధావులు నేషనల్ గ్రీన్ ట్రీబ్యునల్ కోర్టు ను ఆశ్రయించగా ఆక్రమణలను గుర్తించి చె రువులను కాపాడాలని కోర్టు తీర్పును వెలువరించింది. రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్, సర్వే, పోలీస్ అధికారులు ఆక్రమణలను కూ ల్చి బయోఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అయినా గత ప్రభుత్వ పరపతితో వాటిని కూల్చకుండా తెరవెనుక భూకబ్జాదారులు చక్రం తిప్పారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చెరువుల్లో నిర్మించిన అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చివేస్తున్నది. జిల్లాలోకి కూడా హైడ్రా పరిధిని విస్తరిస్తారనే వార్తలు వస్తుండడంతో భూకబ్జాదారు ల్లో గుబులు మొదలైంది.