12-02-2025 12:00:00 AM
దుకాణదారులను బలవంతంగా తరలింపు
ఎల్బీనగర్, ఫిబ్రవరి 11: హైకోర్టు తీర్పు తో ఎల్బీనగర్‌లోని సరూర్‌నగర్‌లోని హు డా కాంప్లెక్స్‌ను మంగళ దుకాణదారులను ఖాళీ చే హెచ్‌ఎండీఏ అధికారు లు స్వాధీనం చేసుకున్నారు. కోర్టు తీర్పు వచ్చిన మరుసటి రోజే హెచ్‌ఎండీఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సరూర్‌నగర్ రెవెన్యూ పరిధిలోని సర్వేనంబర్ 8లో ప్రభు త్వం స్థలంలో 1981లో హుడా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించారు.
ఇక్కడే రంగారెడ్డి జిల్లా కోర్టు కొనసాగింది. రద్దీ పెరగడం, స్థలం సరిపోకపోవడంతో ఎల్బీనగర్‌కు కోర్టును తర లించారు. అప్పటి నుంచి కాంప్లెక్స్ ఖాళీగా ఉన్నది. కాంప్లెక్స్ కింది భాగంలో ఉన్న 32 దుకాణాలను కొందరు లీజుకు తీసుకున్నా రు. షాపులను ఖాళీ చేయాలని అధికారులు నోటీసులు ఇచ్చారు. కొందరు ఖాళీ చేయ గా, మరికొందరు హైకోర్టును ఆశ్రయించా రు.
32 మడిగెల్లో కొనసాగినవారు 2008 నుంచి ఇప్పటివరకు అద్దె ప్రభుత్వానికి చెల్లించలేదు. గతంలో మడిగెలను లీజుకు తీసుకున్నవారు వీరినుంచి అద్దె వసూలు చే రు. హెచ్‌ఎండీఏ అధికారులు భవనం పాత కూల్చివేయాలని ప్రభుత్వానికి సూచించారు. ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీర్ల బృందం నివేదిక అధారంగా భవనాన్ని ఖాళీ చేయాలని హైకోర్టు తీర్పు ఇ చ్చింది.
మంగళవారం హెచ్‌ఎండీఏ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీఎస్పీ జానకిరెడ్డి ఆధ్వ సరూర్‌నగర్ సీఐ సైదిరెడ్డి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పా చేసి, దుకాణదారు లను బల ఖాళీ చేయించి, భవనం స్వాధీనం చేసుకున్నారు. దుకాణదారులకు తమ సామగ్రిని తరలించడానికి ఒక్కరోజు సమయం ఇవ్వకపోవడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.