calender_icon.png 22 April, 2025 | 8:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హెచ్‌ఆర్డి స్కూల్ విద్యార్థికి జాట్ సినిమాలో అవకాశం

22-04-2025 02:02:21 AM

- దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చిత్రం

- బాలీవుడ్ నటుల సరసన నటించే చాన్స్ 

ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 21:తాజాగా విడుదలై హిట్ టాక్ ను సొంతం చేసుకున్న జాట్ సినిమాలో శ్రీరాముడి పాత్రతో అలరించిన రణవీర్ ఇబ్రహీంపట్నం సమీపంలోని సీతారాంపేట్ లో ఉన్న హెచ్‌ఆర్డి స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ లో చదువుతున్న విద్యార్థి.

ఈ పాత్ర కోసం దర్శకుడు గోపీచంద్ మలినేని ఆధ్వర్యంలో నిర్వహించిన ఆడిషన్లో వందలమంది విద్యార్థులు పాల్గొనగా, రణవీర్ మాత్రమే ఎంపికవడం విశేషం. రణవీర్ నటనతో పాటు తన డ్యాన్సింగ్ టాలెంట్తోనూ ప్రేక్షకులను మెప్పించాడు. బాలీవుడ్ నటులు సన్నీ డియోల్, రందీప్ హుడా, రెజీనా లతో కలిసి నటించే చాన్స్ లభించింది.

ఈ విజయానికి ముఖ్య కారణంగా హెచ్‌ఆర్డి స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ లో డ్యాన్స్ టీచర్గా పనిచేస్తున్న ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ సత్యా మాస్టర్ కృషి ఎంతో ఉంది. వారి శిక్షణ, ప్రోత్సాహం వల్లే తనలోని ప్రతిభను పూర్తిగా వెలికితీసి, సినిమా ప్రపంచంలో అడుగుపెట్టగలిగాడు. ఈ సందర్భంగా హెచ్‌ఆర్డి స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ యాజమాన్యం, టీచర్లు, విద్యార్థులు రణవీర్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.