చుక్క.. ముక్క లేకుండా సంక్రాంతి పండగను మందుబాబులు జరుపుకోరు. సంక్రాంతే కాదు.. ఏ పండక్కై నా, చిన్నపాటి ఫంక్షన్ అయినా బీరు కొట్టాల్సిందే అంటుంటారు. అందులో నూ కింగ్‌ఫిషర్ ఉండాల్సిదే. అలాంటిది.. ఈసారి తెలంగాణలో కింగ్‌ఫిషర్ బీరు లేకుండానే సంక్రాంతి పండుగను ఎలా జరుపుకొనేదని మందుబాబులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
కింగ్‌ఫిషర్ బీరు తయారుచేసే సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో కింగ్‌షిషర్, హీన్‌కెన్ బీర్ల సరఫరాను నిలిపేస్తున్నట్టు ఇటీవల యునైటెడ్ బ్రూవరీ ప్రైవేట్ లిమిటెడ్ చేసిన ప్రకటన ఇప్పుడు వేరే బీరుబాబులను ఆందోళనకు గురిచేస్తుంది. పండుగగోలి తమకు నచ్చని బీరుతో కానిచ్చేయాల్సిందేనా? అని చర్చించుకుంటున్నారు.