calender_icon.png 19 January, 2025 | 9:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎంత కలత చెందావో..

19-01-2025 12:00:00 AM

సోషల్ మీడియాలో నెగెటివిటీ రోజు రోజుకూ పెరిగిపోతోంది. సెలబ్రిటీలను, సినిమాలను టార్గెట్ చేస్తూ వస్తున్న నెగిటివ్ ట్రోల్స్, నెగిటివ్ ట్యాగ్స్‌పై మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తాజాగా ఓ కార్యకక్రమంలో ఒకింత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై చిరంజీవి స్పందించారు. తమన్ మాటలు హృదయాన్ని తాకే లా ఉన్నాయన్నారు. “డియర్ తమన్.. నువ్వు మాట్లాడిన మాటలు హృదయాల్ని తాకేలా ఉన్నాయి.

ఎప్పుడూ సరదాగా మాట్లాడుతూ ఉండే నీలో ఇంత ఆవేదన ఉండడం నాకు ఒకింత ఆశ్చర్యంగా కూడా అనిపించింది. కానీ మనసు ఎంత కలత చెందితే నువ్వింతగా స్పందించావో అని అనిపించింది.

విషయం సినిమా అయినా, క్రికెట్ అయినా, మరో సామాజిక సమస్య అయినా సోషల్ మీడియా వాడుతున్న ప్రతి ఒక్కరు తమ మాటల తాలూకు ప్రభావం ఆ వ్యక్తుల మీద ఎలా ఉంటుందోనని ఆలోచించాలి. ఎవరో అన్నట్టు మాటలు ఫ్రీనే, మాటలు మనలో స్ఫూర్తిని నింపుతాయి. అవే మాటలు మనల్ని నాశనం కూడా చేస్తాయి. మీకేం కావాలనేది మీరే నిర్ణయించుకోండి. మనం పాజిటివ్‌గా ఉంటే ఆ ఎనర్జీ మన జీవితాలను కూడా అంతే పాజిటివ్‌గా ముందుకు నడిపిస్తుంది” అన్నారు.