calender_icon.png 23 February, 2025 | 11:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లోషన్ రాస్తున్నారా?

23-02-2025 12:00:00 AM

వాతావరణం మారింది.. ఆ ప్రభావం చర్మంపైనా కనిపిస్తుంది. తద్వారా చర్మం పొడిబారి నిర్జీవంగా మారతుంది. అయితే చర్మంలో తేమని నిలిపి ఉంచడానికి ఏదో ఒక క్రీమ్ లేదా బాడీ లోషన్ రాసుకుంటే సరిపోతుందనుకుంటారు చాలామంది. కానీ వాటిలో కూడా చర్మతత్వానికి నప్పే లోషన్లను ఎంచుకోవడం ముఖ్యమంటు న్నారు నిపుణులు. 

ముఖానికి లేదా చర్మానికి క్రీములు, లోషన్లు.. మొదలైనవి రాసుకునే ముందు చర్మాన్ని శుభ్రం చేసుకోవడం తప్పనిసరి. అలాగే చర్మం కాస్త తడిగా ఉన్నప్పుడే వాటిని రాసుకోవాలి. అప్పుడే అది చర్మ గ్రంథుల్లోకి చేరే అవకాశం ఉంటుంది. తద్వారా చర్మం తేమను కోల్పోకుండా జాగ్రత్తపడచ్చు. 

క్రీమ్ లేదా బాడీ లోషన్స్ ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా.. స్నానం చేసిన వెంటనే రాసుకోవాలి. ఎందుకంటే ఆ సమయంలో చర్మ కణాలు తెరుచుకుని ఉంటాయి. కాబట్టి ఆ సమయంలో క్రీమ్ లేదా లోషన్స్ రాసుకుంటే అది చర్మ గ్రంథుల్లోకి చేరి సులభంగా ఇంకుతుంది. 

చర్మం కాస్త వేడిగా ఉన్నప్పుడే క్రీమ్ లేదా లోషన్స్ రాసుకుంటే అవి చర్మంలోకి సులభంగా ఇంకుతాయంటు న్నారు నిపుణులు. అందుకే క్రీమ్ లేదా లోషన్ రాసుకునే ముందు చర్మం చల్లగా అనిపిస్తే.. గోరువెచ్చని నీటితో టవల్‌తో తుడుచుకొని ఆపై లోషన్‌ను చర్మానికి అప్లై చేసుకోవాలంటున్నారు. 

పొడిబారి నిర్జీవంగా మారిపోయిన చర్మానికి క్రీమ్ లేదా లోషన్ రాసుకోవడం వల్ల అది తేమను సంతరించుకుంటుంది.

బాడీ లోషన్ వెదజల్లే పరిమళాలు మానసిక ప్రశాంతతనూ అందిస్తాయి.

గరుకుగా ఉండే చర్మ భాగాలపై తరచుగా క్రీమ్ లేదా లోషన్స్ అప్లై చేయడం వల్ల కొన్నాళ్లకు చర్మం మృదువుగా మారుతుంది.