calender_icon.png 3 April, 2025 | 3:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అడ్డుకట్ట ఎలా?

02-04-2025 01:27:37 AM

మంత్రులతో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష

హైదరాబాద్, ఏప్రిల్ 1 (విజయ క్రాంతి) : కంచ గచ్చిబౌలి పరిధిలోని భూముల వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి  మంగళవారం హైదరాబాద్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో అందుబాటులో ఉన్న మంత్రులతో సమీక్షించారు. ఈ సమావేశానికి డిప్యూ టీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు,  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, జూపల్లి కృష్ణారావు హాజర య్యారు.

విద్యార్థులు, రాజకీయ పార్టీలు చేస్తున్న ఆందోళనపై ఎలా ముందుకు వెళ్లాలనే విషయంపై సీఎం చర్చించారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు కలిసి అడ్డు కోవాలని చూస్తున్నాయని, వీటికి అడ్డు కట్ట వేయాలని ముఖ్యమంత్రి సూచిం చారు. ప్రయివేట్ వ్యక్తుల చేతుల్లో ఉన్న రూ. వేల కోట్ల విలువ చేసే భూములను ప్రభుత్వం న్యాయ పోరాటం చేసి సాధించుకున్న విషయాన్ని ప్రజలకు వివరించాలన్నారు.