calender_icon.png 20 January, 2025 | 11:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అప్పుల భారం గట్టెక్కేదెలా?

03-07-2024 12:15:43 AM

ప్రతి నెలా అప్పులకే రూ.100 కోట్లు చెల్లిస్తున్న జీహెచ్‌ఎంసీ

ప్రభుత్వ భవనాల ట్యాక్స్ రూ. 5 వేల కోట్లకు పైగానే బకాయి 

4న స్టాండింగ్ కమిటీ, 6న కౌన్సిల్ సమావేశం 

ప్రభుత్వంపైనే ఆశలు

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 2(విజయక్రాంతి): జీహెచ్‌ఎంసీ రోజురోజుకూ అప్పుల భారంతో కుంగిపోతోంది. బల్దియాకు రావాల్సిన ఆదాయం ఉన్నప్పటికీ, ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడటం కారణంగా నిధుల విడుదల మరింత జాప్యం అవుతోంది. ఫలితంగా ఆదాయం లేకున్నా వడ్డీలు, ఇతర చెల్లింపులకు అధికారులు ప్రతి నెలా నిధులు వెతుక్కోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీకి రావాల్సిన వేల కోట్ల బకాయిలు రాకపోవడంతో ప్రతి ఏడాది వసూలయ్యే ప్రాపర్టీ ట్యాక్స్‌పైనే ఆధారపడాల్సి వస్తోంది.

ప్రస్తుత ప్రభుత్వం జీహెచ్‌ఎంసీని అప్పుల భారం నుంచి గట్టెక్కించే ప్రయత్నాలు చేస్తుందా అనే విషయంపై ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 4న జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ, 6వ తేదీన జనరల్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా జీహెచ్‌ఎంసీలో అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపు, తదితర సమస్యలపై చర్చ వాడీవేడిగా జరిగే అవకాశం ఉంది. 

ప్రభుత్వమే రూ.5 వేల కోట్ల బకాయి.. 

జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంతో పాటు 6 జోనల్, 30 సర్కిళ్ల కార్యాలయా లు, బుద్ధ భవన్‌లో ఈవీడీఎంతో పాటు ఇతర సెక్షన్లు పనిచేస్తున్నా యి. జీహెచ్‌ఎంసీ ఉద్యోగుల జీతాలు, ఇతరత్రా నిర్వహణ ఖర్చులన్నీ కలిపి దాదాపు రూ.150 కోట్లు ప్రతినెలా చెల్లించాల్సి ఉంది. ఎస్‌ఎన్‌డీపీ, ఎస్‌ఆర్‌డీపీ, సీఆర్‌ఎంపీ రహదారులు తదితర ప్రాజెక్టుల నిర్వహణకు బల్దియా చేసిన రూ. 6,500 కోట్ల అప్పులకు ప్రతినెలా అసలుతో పాటు వడ్డీ రూ.100 కోట్లు చెల్లించాల్సి వస్తోంది. దీంతో జీహెచ్‌ఎంసీకి ప్రతినెలా కనీసం రూ.250 కోట్ల నుంచి రూ.300 కోట్లు అవసరం ఉంటుంది.

గ్రేటర్‌లో వివిధ పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు రూ.1,300 కోట్ల బకాయి ఉంది. కానీ జీహెచ్‌ఎంసీ ప్రాపర్టీ ట్యాక్స్‌పైనే ఆధారపడాల్సిన దుస్థితి నెలకొన్నది. ఈ ప్రాపర్టీ ట్యాక్స్ ప్రతినెలా రూ. 50 కోట్లు మాత్రమే సమకూరు తున్నట్టు అధికారులు చెబుతున్నారు. ప్రభు త్వ భవనాల ప్రాపర్టీ ట్యాక్స్ కొన్నేళ్లుగా రూ. 5 వేల కోట్లకు పైగానే పెండింగ్ ఉంది. ప్రతి 6 మాసాలకు ఒకసారి రూ.150 కోట్లు, బిల్లు సకాలంలో చెల్లించని కారణంగా మరో రూ.1.5 కోట్లు వడ్డీకి కూడా జమ అవుతుంది. పూర్వపు కమిషనర్ రోనాల్డ్ రాస్ కొంత ప్రయత్నం చేసి ఈ నిధుల నుంచి రూ.100 కోట్ల దాకా ప్రభుత్వం నుంచి రాబట్టినట్టు సమాచారం. 

జనరల్ కౌన్సిల్‌కు 148 ప్రశ్నలు సిద్ధం.. 

ఆమ్రపాలికి వివిధ శాఖలలో ముఖ్యమైన బాధ్యతలు ఉన్నప్పటికీ, జీహెచ్‌ఎంసీలోనూ ప్రభుత్వం ఎఫ్‌ఏసీ బాధ్యతలు అప్పగించింది. ఇదిలా ఉండగా బీఆర్‌ఎస్ పార్టీ నుంచి గెలుపొంది మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు పొందిన గద్వాల విజయలక్ష్మి, మోతె శ్రీలతా శోభన్ రెడ్డి ప్రస్తుతం అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి మరిన్ని నిధులను రాబట్టేందుకు మేయర్, డిప్యూటీ మేయర్‌తో పాటు నూతన కమిషనర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది.

ఈ పరిస్థితుల్లోనే వారానికి ఒకసారి నిర్వహించాల్సిన స్టాండింగ్ కమిటీ, ప్రతి మూడు నెలలకోసారి జరగాల్సిన బల్దియా జనరల్ కౌన్సిల్ సమావేశాలు ఈ నెల 4, 6వ తేదీ ల్లో జరగనున్నాయి. 4న మధ్యాహ్నం 3 గంటలకు జరిగే స్టాండింగ్ కమిటీ సమావేశానికి 11 అంశాలు అజెండాగా ఉన్నట్టు సమాచారం. 6న నిర్వహించే జనరల్ కౌన్సిల్‌కు సభ్యుల నుంచి 148 ప్రశ్నలు అందిన ట్టుగా తెలుస్తోంది. అంతే కాకుండా, మేయ ర్, డిప్యూటీ మేయర్ పార్టీ పిరాయింపు చేయడంతో బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు ఎలాం టి ప్రశ్నలను సంధిస్తారో చూడాల్సి ఉంది.