calender_icon.png 1 November, 2024 | 8:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాదాలు తగ్గేదెలా?

28-04-2024 12:10:00 AM

రాష్ట్రంలోనేకాదు, దేశంలోనూ రోడ్డు ప్రమాదాలు రానురాను పెరుగుతున్నాయి. మూడు రోజుల వ్యవధిలోనే రాష్ట్రంలో వివిధ ప్రమాదాలలో పాతిక మందికి పైగా మృతి చెందినట్టు తెలుస్తున్నది. చాలావరకు కారణాలు దాదాపు అందరికీ తెలిసినవే వుంటాయి. నిలుపకూడని చోట వాహనాలను ఆపడం, నిర్లక్ష్య డ్రైవింగ్, రహదారి నియమాలు పాటించక పోవడం వంటి అంశాలతోపాటు రోడ్డుమార్గాలు కూడా సవ్యంగా లేకపోవడం ఒక కారణంగా భావించాలి. ప్రమాదకరమైన మలుపులు, వాహనాలను కండిషన్‌లో వుంచుకోకపోవడం వంటి విషయాలపైనా అటు అధికారులు, వాహనదారులు దృష్టి పెట్టాలి. 

పవన్‌కుమార్, మణుగూరు