ప్రస్తుతం చాలామంది డార్క్ సర్కిల్స్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. వీటివల్ల ముఖం అందం తగ్గిపోతుంది. డార్క్ సర్కిల్స్ రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. కళ్ల కింద ఉండే నల్లటి వలయాలను డార్క్ సర్కిల్స్ అంటారు. చర్మం డీహైడ్రేషన్‌కు గురికావడం వల్ల కూడా డార్క్ సర్కిల్స్ ఏర్పడతాయి. దీన్ని అధిగమించాలంటే చర్మ సంరక్షణకు సంబంధించి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.
* డార్క్ సర్కిల్స్ అంటే రెండు కళ్ల కింద నల్లటి వలయాలు. ఇవి సాధా రణ చర్మం రంగు కంటే ముదురు రంగులో కనిపి స్తాయి. కళ్ల కింద, చుట్టూ ఉన్న చర్మం చాలా సున్ని తంగా ఉంటుంది కాబట్టి నల్లగా మారేందుకు అవ కాశం ఉంటుంది.
* కళ్ల కింద నల్లటి వలయాలు, ఫైన్ లైన్స్ రావడానికి అసలు కారణం శరీరంలో సమస్యలకు కారణం. ఏడుపు, అలర్జీలు, అలసట, నిద్రలేమి, కళ్లను రుద్దడం, ఎక్కువసేపు సూర్యరశ్మికి గురికావడం వల్ల డార్క్ సర్కిల్స్ వస్తాయి.
* కళ్లకింద, చుట్టూ ఉన్న సున్నితమైన చర్మం ఆరోగ్యంగా, మృదువుగా మెరుస్తూ ఉండాలంటే పుష్కలంగా నీరు తాగాలి.
* డార్క్ సర్కిల్స్ తగ్గించడానికి మంచి చిట్కా ఏంటంటే.. కలబంద జెల్‌ను కళ్ల కింద అప్లు చేసి సున్నితంగా మసాజ్ చేసి 5 నిమిషాల తర్వాత ముఖం కడుక్కోవాలి. ఇలా చేస్తే కళ్ల కింద ఉండే పిగ్మెంటేషన్ తగ్గుతుంది.
* నిమ్మరసంలో కొద్దిగా బాదం నూనె మిక్స్ చేసి కళ్ల చుట్టూ ఉన్న చర్మానికి మసాజ్ చేసి ఐదు నిమిషాల తర్వాత ముఖం కడుక్కోవాలి. ఇది నల్లటి వలయాలను తగ్గిస్తుంది. అంతే కాదు చర్మాన్ని తాజాగా ఉంచుతుంది.
* రాత్రి పడుకునే ముందు కొబ్బరి నూనెలో విటమిన్ ఇ మిక్స్ చేసి కళ్ల చుట్టూ ఉన్న చర్మానికి మసాజ్ చేసి ఉదయాన్నే గోరు వెచ్చటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఇలా చేయడం డార్క్ సర్కిల్స్ తగ్గుతాయి.