calender_icon.png 20 November, 2024 | 2:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చర్లపల్లికి చేరేదెట్ల?

14-09-2024 01:19:14 AM

  1. త్వరలో ‘రైల్వే టెర్మినల్’ ప్రారంభోత్సవం 
  2. ప్రయాణికులు అక్కడికి చేరుకునే ‘మార్గ’మేంటి? 
  3. నగరంలో ఇరుకు గానే మేజర్ రహదారులు 
  4. కనాకష్టంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం 
  5. అంతంతమాత్రంగా ఎంఎంటీఎస్ రైల్ సేవలు 
  6. రోడ్ల విస్తరణపై సీఎంకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి లేఖ 
  7. ఇప్పటికైనా సర్కార్ స్పందించేనా? పరిష్కార మార్గం చూపెనా?

హైదరాబాద్, సెప్టెంబర్ 1౩ (విజయక్రాంతి): నగరవాసులకు మెరుగైన రైల్వే సేవలు అందించేందుకు దక్షిణ మధ్య రైల్వే శాఖ చర్లపల్లి రైల్వే స్టేషన్‌ను టెర్మినల్‌గా విస్తరించింది. మొత్తం రూ.415 కోట్లతో పనులు చేపట్టింది. ఆ పనులు దాదాపు పూర్తికావొచ్చాయి. త్వరలో టెర్మినల్‌ను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. కానీ, అక్కడికి చేరుకునేందుకు సరైన రోడ్డుమార్గాలు లేకపోవ డంతో ప్రయాణికులు ఎలా చేరుకుంటారనే ప్రశ్న తలెత్తుతున్నది. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రి, ఎంపీ కిషన్‌రెడ్డి సోమవారం సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు.

రోడ్ల విస్తరణ చేపట్టి చర్లపల్లిని చేరుకునేందుకు మార్గం సుగమం చేయాలని విజ్ఞప్తి చేశారు. రైల్వే టెర్మినల్ చేరుకునేందుకు ఎఫ్‌సీఐ గోదాం వైపు నుంచి 100 అడుగుల రోడ్డు నిర్మాణం, ఉత్తరం వైపు (భరత్‌నగర్) 80 అడుగుల మార్గం, మహాలక్ష్మినగర్ వైపు మరో 80 అడుగుల రోడ్డు నిర్మించాల్సి ఉంది. ఇండస్ట్రియల్ షెడ్స్ ముందున్న రోడ్డును సైతం 80 ఫీట్లకు విస్తరించాల్సిన అవసరం ఉంది. 

టెర్మినల్‌కు అడుగులు ఇలా..

నగరంలోని సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ రైల్వేస్టేషన్ల నుంచి రాకపోకలు సాగించే రైళ్ల సంఖ్య ఎక్కువగా ఉండడం, రోజురోజుకు ప్రయాణికుల సంఖ్య పెరుగుతుండడంతో ఆయా స్టేషన్లపై ముందెన్నడూ లేని ఒత్తిడి పెరుగుతోంది.దీంతో రైల్వేశాఖ కొత్త రైల్వే టెర్మినల్స్ నిర్మించాలని నిర్ణయించింది. దీనిలో భాగంగానే లింగంపల్లి టెర్మిన ల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. కానీ ఇక్కడి నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లు పెద్దగా ఉండవు. దీంతో సికింద్రాబాద్‌కు చెరువలో ఉన్న చర్లపల్లిని టెర్మినల్ చేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది.

ఇరుకు రోడ్లతో సికింద్రాబాద్ చేరుకునేదెట్లా?

దక్షిణ మధ్య జోన్‌లోనే అతి పెద్ద రైల్వేస్టేషన్ సికింద్రాబాద్. నిత్యం వేలాది మంది ప్రయాణికులు ఇక్కడి నుంచి రాకపోకలు సాగిస్తుంటారు. కానీ సికింద్రాబాద్ చేరుకునేందుకు ప్రస్తుతం నగరంలో సరైన రోడ్లు లేవు. ఇరుకు రోడ్ల మధ్య నుంచి, వీధి వ్యాపారుల తోపుడు బండ్ల మధ్య నుంచే సర్వీసులు నడుస్తున్నాయి. రోడ్ల విస్తరణ లేకపోవడంతో సికింద్రాబాద్‌కు వెళ్లే ప్రయాణి కులు వ్యయప్రయాసలకు గురవుతున్నారు.

ఆర్టీసీ సిటీ బస్సులు పెంచాల్సిందే..

ప్రస్తుతం చర్లపల్లికి నిత్యం పరిమిత సంఖ్యలో సిటీ బస్సులు తిరుగుతున్నాయి. ఒకవేళ టెర్మినల్ ప్రారంభమైతే ఆ సర్వీసులు ఏమాత్రం కూడా సరిపోవు. కాబట్టి సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లకు అత్యధిక సర్వీసులు ఉన్నట్లుగానే చర్లపల్లికికీ నగరంలోని అన్ని ప్రాంతాల నుంచి సర్వీసులు పెంచాల్సి ఉన్నది.

రాష్ట్రం, కేంద్రం సమన్వయంతో సాధిస్తేనే..

చర్లపల్లి, సికింద్రాబాద్ రైల్వే టెర్మినల్స్ చేరుకునేందుకు ఆర్టీసీ సిటీ బస్సులు, ఎంఎంటీఎస్ రైళ్లు పెంచాల్సి ఉంది. అందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకు పోతే తప్ప సమస్యకు పరిష్కారం లభించేలా లేదు. కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కుమార్, సీఎం రేవంత్‌రెడ్డితో పాటు రైల్వే శాఖ, ఆర్టీసీ, జీహెచ్‌ఎంసీ అధికారులు అనేకసార్లు సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసి సమస్యలను అధిగమించాల్సిన అవసరం ఉంది.

ఎంఎంటీఎస్ రైళ్లేవి?

వేళాపాలా లేని ఎంఎంటీఎస్ రైళ్లు ప్రయాణికులకు పెద్దగా సేవలు అందించడం లేదనే విమర్శలు ఉన్నా యి. 2003లో ప్రారంభమైన ఎంఎంటీఎస్ రైళ్లు మొదట్లో చాలా చక్కగా నడిచాయి. నాడు  నిత్యం 50కి పైగా ప్రయాణికులతో కిటికిటలాడుతూ కనిపించేవి. తెలంగాణ ఏర్పడిన తర్వాత నాటి ప్రభుత్వం నుంచి పెద్ద గా ఎంఎంటీఎస్‌కు సహకారం లేకపోవడంతో రైల్వేశాఖ స్థానిక రైలు సర్వీ సులపై శీతకన్ను వేసింది. దీంతో క్రమంగా రైళ్ల సంఖ్య తగ్గుతూ వచ్చిం ది. మౌలాలి మధ్య రెండో దశ ఎంఎంటీఎస్ రైల్వే లైన్ ప్రారంభమైన తర్వాత ప్రస్తుతం ఘట్‌కేసర్ నుంచి లింగంపల్లికి 47 కి.మీ మేర ఒకే ఒక రైలు తిరుగుతున్నది.

అలాగే ఫలక్‌నుమా లింగపల్లికి ఆరు, ఉందానగర్ లింగంపల్లికి తొమ్మిది, సికింద్రాబాద్ ఏడు, హైదరాబాద్ ఒకటి, ఫలక్‌నుమాకింద్రాబాద్‌కు ఒకటి, ఫలక్‌నుమా ఒకటి, ఉందానగర్ సికింద్రా బాద్‌కు ఒకటి, లింగంపల్లి ఒకటి, హైదరాబాద్ కు ఒకటి.. ఇలా మొత్తం 29 ఎంఎంటీఎస్ రైళ్లు మాత్రమే తిరుగుతు న్నాయి. మున్ముందు ఇవి కూడా రద్ద య్యే పరిస్థితులూ లేకపోలేవు. రైల్వేశాఖ చొరవ తీసుకుని ఎంఎంటీఎస్ రైళ్లను పెంచడంతో రైళ్లు వచ్చే సమయాలను కచ్చితంగా పాటిస్తే తప్ప ఫలితం ఉండదు.