calender_icon.png 19 November, 2024 | 8:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాలుష్యానికి చెక్!

19-11-2024 12:00:00 AM

వాతావరణ కాలుష్యం ప్రపంచవ్యాప్తంగా ఓ పెద్ద సమస్యగా మారిన నేపథ్యంలో అన్నిదేశాలు వాయు కాలుష్యాన్ని ముఖ్యంగా మహానగరాల్లో  విపరీతంగా పెరిగిపోతున్న వాహనాల వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి పెద్ద ఎత్తున చర్యలు చేపడుతున్నాయి.  కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఇప్పటికే ఎలక్ట్రానిక్ వాహనాల తయారీ పరిశ్రమలకు పలు ప్రోత్సాహకాలు ప్రకటించి ఆ దిశగా కంపెనీలను ప్రోత్స హిస్తోంది.

మరోవైపు రాష్ట్రాలు కూడా నగరాల్లో  రోడ్లపై తిరుగాడే కాలుష్యకారక వాహనాల సంఖ్యను వీలయినంత మేరకు తగ్గించేందుకు కొత్త విధానాలను ప్రకటిస్తున్నాయి. కర్నాటక ప్రభుత్వం ఇటీవలే ఎలక్ట్రానిక్ వాహనాలను ప్రోత్సహించే దిశగా సరికొత్త విధానాన్ని ప్రకటించింది. అయితే ఎలక్ట్రానిక్ వాహన తయారీదారులకు ప్రోత్సాహకాలను ప్రకటించిన ఆ రాష్ట్రప్రభుత్వం దానివల్ల కలిగే ఆర్థిక ప్రయోజనాలను మాత్రం వినియోగదారులకు అందించే దిశగా  చర్యలను ప్రకటించలేదు.

అయితే ఈ విషయంలో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరోఅడుగు ముం దుకు వేసి తయారీదారులతో పాటుగా కొనుగోలుదారులకు కూడా ఆర్థిక ప్రయోజనం అందించే విధంగా కొత్త విధానాన్ని ప్రకటించింది. రాష్ట్ర రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదివారం ఈ కొత్త ఎలక్ట్రానిక్ వాహనాల పాలసీని ప్రకటించారు. దీనికి సంబంధించిన జీవోను సైతం విడుద ల చేసినట్లు ఆయన చెప్పారు.

దీనిప్రకారం 2026 డిసెంబర్ 31 దాకా రాష్ట్రంలో కొనుగోలు చేసే, రిజిస్టర్ అయ్యే అన్ని ఎలక్ట్రానిక్ వాహనాలకు రోడ్డుటాక్స్‌తో పాటుగా రిజిస్ట్రేషన్ ఫీజునుంచి పూర్తి మినహాయింపు లభిస్తుంది. తక్షణం అమలులోకి వచ్చే ఈ విధానం ముఖ్యంగా ప్యాసింజర్ వాహనాల విషయంలో  ఎలక్ట్రానిక్ వాహనాల వైపు మొగ్గు చూపేందుకు దోహదపడుతుందని రాష్ట్రప్రభుత్వం  భావిస్తోంది. గతంలో కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్‌ఎస్ ప్రభుత్వం కూడా ఎలక్ట్రానిక్ వాహనాలకు పలు ప్రోత్సాహకాలను ప్రకటించింది.

కానీ వాహనాల సంఖ్యను 5 వేలకు పరిమితం చేసింది. అయితే ఇప్పడు రేవంత్ ప్రభుత్వం ఈ పరిమితిని ఎత్తివే సింది. ఈవీల రిజిస్ట్రేషన్లపై పరిమితిని పూర్తిగా ఎత్తివేయడం ద్వారా హైదరాబాద్‌ను కాలుష్యరహిత నగరంగా చేయాలని రాష్ట్రప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని కూడా మంత్రి చెప్పారు. హైదరాబాద్ కూడా ఢిల్లీ తరహాలో కాలుష్య నగరంగా మారకుండా చూడడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

రాష్ట్రంలో రిజిస్టర్ అయిన లక్షలాది వాహనాల్లో ప్రస్తుతం 5 శాతం దాకా ఎలక్ట్రానిక్ వాహనాలున్నాయి. రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సాహకాలతో ఈవీల ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. అంతేకాకుండా కొనుగోలుదారులకు వేలాది రూపాయలు ఆదా అవుతుంది. రాష్ట్రప్రభుత్వానికి ప్రస్తుతానికి  ఆదాయం తగ్గనున్నప్పటికీ దీర్ఘకాలికంగా భారీ ప్రయోజనం కలుగుతుంది.  

ఈ విధానం కేవలం ద్విచక్ర వాహనాలు,  కార్లు లాంటి ప్రయాణికుల కు మాత్రమే కాకుండా టాక్సీలు, ఆటోలు, బస్సులు, తేలికపాటి వాణిజ్య వాహనాలులాంటి వాటికి కూడా వర్తింపజేయనున్నట్లు మంత్రి ప్రకటించడం విశేషం. అంతేకాకుండా హైదరాబాద్‌లో తిరిగే 3 వేలకు పైగా సిటీ బస్సుల స్థానంలో రాబోయే రెండేళ్లలో పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టాలని కూడా ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే నగ రంలో 102 ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ నడుపుతోంది. వీటికి అదనంగా మరో 438 బస్సులను త్వరలో ప్రవేశపెట్టనున్నారు. దీనికి అనుగుణంగా నగరంలో మరో ఐదు ఆర్టీసీ డిపోలో ్లఈవీ చార్జింగ్   పాయింట్లను ఏర్పా టు చేసే దిశగా చర్యలు తీసుకొంటున్నారు. కాలం చెల్లిన వాహనాలను వదిలించుకోవడానికి ఇప్పటికే సా్ర్క్కప్ పాలసీని తీసుకువచ్చిన రాష్ట్రప్రభుత్వం తాజాగా ప్రకటించిన కొత్త ఈవీ పాలసీ గనుక విజయవంతమ యితే నగరంలో వాయుకాలుష్యం గణనీయంగా తగ్గడంతో పాటు సుఖవంతమయిన ప్రయాణాన్ని సాగించడానికి వీలవుతుంది. అంతేకాకుండా తెలంగాణ ఈవీ పాలసీ ఇతర రాష్ట్రాలకూ ఆదర్శంగా మారుతుంది.