పిటిషనర్‌ను ప్రశ్నించిన హైకోర్టు
హైదరాబాద్, జనవరి 3 (విజయక్రాంతి): ‘అమెరికాలో ఉంటున్న అల్లుడిపై కేసు నమోదు చేయాలని పోలీస్ శాఖను ఎలా ఆదేశించగలం ? కేసును ఎలా విచారించగలం ?’ అ ని హైకోర్టు పిటిషనర్‌ను ప్రశ్నించిం ది. తన కుమార్తెను వేధిస్తున్న ఎన్‌ఆర్‌ఐ అల్లుడిపై కేసు నమోదు చేసేలా పోలీసులకు ఆదేశాలివ్వాలని కోరు తూ హైదరాబాద్‌లోని ఎస్సార్ నగర్‌కు చెందిన వృద్ధుడు కోర్టును ఆశ్ర యించాడు.
పిటిషన్‌పై న్యాయమూ ర్తి విజయసేన్‌రెడ్డి శుక్రవారం విచారిస్తూ.. విదేశంలో ఉన్న భార్యాభర్తల మధ్య వివాదాన్ని ఇక్కడి కోర్టు ఎలా విచారించగలమనే ప్రశ్న లేవనెత్తారు. అల్లు డు, కుమార్తె అమెరికాలో ఉండగా, ఇక్కడి పోలీసులకు కేసు నమోదు చే యాలని ఎలా ఆదేశిస్తామన్నారు. దీనిపై వివరణ ఇవ్వాలని పిటిషనర్‌ను ఆదేశించిం చారు. విచారణను 8కి వాయిదా వేశారు.