- బడ్జెట్ అంచనాలను చేరుకోవడమే టార్గెట్
- లీకేజీలను అరికడితేనే లక్ష్యాన్ని చేరుకుంటాం
- ఆదాయం తెచ్చే శాఖల సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, అక్టోబర్ 10 (విజయక్రాం తి): ఆదాయాన్ని పెంచుకోవడంపై ప్రభు త్వం దృష్టి సారించించి. నెలానెలా రాబడు ల్లో తగ్గుదల నమోదవుతున్న నేపథ్యంలో ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. ఈ క్రమంలోనే బడ్జెట్ అంచనాలను ఎలాగైనా అందుకోవాలని సర్కారు భావిస్తోంది.
అం దుకోసమే గురువారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో ఆదాయం తెచ్చే శాఖలతో సమీక్ష నిర్వహించారు. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, మైనింగ్‌తో పాటు ఇతర శాఖల్లో ఆదాయాన్ని 100 శాతం లక్ష్యాన్ని చేరుకునేలా పనిచేయాలని ఆదేశించారు. నెలవారీ లక్ష్యాలను నిర్దేశించుకొని పనిచేయాలని సూచించారు.
ఇప్పుడు వస్తున్న రాబడిని పెంచుకోవాడానికి ఇంకా ఏమైనా మార్గాలు ఉన్నాయో ప్రణాళికలను తయారు చేయాలని ఆదేశించారు. లీకేజీలను అరికట్టే అంశం పై దృష్టి పెట్టాలన్నారు. విజిలెన్స్ విభాగాన్ని మరింత పటిష్టం చేయాలని దిశానిర్దేశం చేశారు. సమీక్షలో సీఎస్ శాంతికుమారి, ఆర్థిక శాఖ ప్రత్యే క ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, హౌసింగ్ ప్రత్యేక కార్యదర్శి వికాస్‌రాజ్, అధికారులు పాల్గొన్నారు.