calender_icon.png 27 February, 2025 | 4:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనుమతి లేకుంటే అడ్మిషన్ ఎలా?

27-02-2025 02:06:06 AM

  • న్యూ బ్రిలియంట్ స్కూలుకు అనుమతి ఉన్నట్టా..? లేనట్టా.?
  • ఈ స్కూలులో  8, 9, 10వ తరగతులకు అనుమతి ఇవ్వడం లేదంటూ ఎంఈఓపై విద్యార్థి సంఘాల ఫిర్యాదు 
  • పాఠశాలకు అనుమతి లేదంటూ ఉన్నత అధికారుల నోటీసును పాఠశాల నిర్వాహకులకు అందించిన ఎంఈఓ రాజు నాయక్ 
  • నేషనల్ హైవే 167పై ఉందంటూ ఉన్నత విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు 
  • 2025 విద్యా సంవత్సరం నుంచి పాఠశాల  మూసివేయాలని ఉత్తర్వులు జారీ 

మహమ్మదాబాద్, ఫిబ్రవరి 26 : బాల బాలికలకు బంగారు భవిష్యత్తు అందించాలని సంకల్పంతోపాటు నిరుద్యోగులకు ఉపాధి ఉద్యోగ కల్పన జరుగుతుందనే ఆశయంతో ప్రభుత్వము నాటి నుంచి ప్రైవేట్ స్కూళ్లకు అనుమతులు ఇవ్వడం జరిగింది. ఈ తరుణంలో ఆయా ప్రాంతాల్లో ఉంటు న్న విద్యార్థులకు మంచి భవిష్యత్తు అందించడంతోపాటు వారి ఉపాధి పొందాలని గొప్ప ఆశయంతో ఏర్పాటు కు సహకరించిన ప్రభుత్వం నిబంధనలను కొందరు గండి కొడుతుండ్రు.

ప్రైవేట్ పాఠశాలల్లో మీ బిడ్డలను చేర్పించండి ఉన్నత శిఖరాలను అధిరోహించాలా తీర్చిదిద్దుతామంటూ ఆకర్షణీయమైన బ్రోచర్లను ప్రచారం చేసుకుం టూ అనుమతులు లేకుండానే పాఠశాలలను నిర్వహిస్తున్నారు. నిబంధనలను పాటి స్తూ విలువలతో కూడిన విద్య నేర్పిస్తూ విద్యార్థులకు బంగారు భవిష్యత్తు అందించాలని ప్రజా సంఘాల నాయకులు కోరు తుండ్రు.

కాగా కొందరు మాత్రం తక్కువ తరగతులకు అనుమతులు పొంది పై తరగతులు చదువుతున్న విద్యార్థులకు అడ్మిషన్లు ఇస్తూ ఇటు విద్యార్థులను అటు వారి తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేస్తుండ్రు. నిబంధనల మేరకు అనుమతులు తీసుకొని విద్యా బోధన చేస్తే బాగుంటుందని పలువురు కోరుతున్నారు. 

షోకాజ్ నోటీసు..

మహమ్మదాబాద్ మండల కేంద్రంలో నేషనల్ హైవే 167 పక్కన ఉన్న న్యూ బ్రిలియంట్ పాఠశాల కు రాబోయే విద్యా సంవత్సరము మూసివేయండి అంటూ రాష్ర్ట విద్యాశాఖ అధికారులు షోకాజ్ నోటీసులను జారీ చేయడం జరిగింది. ఈ పాఠశాలలో 8వ తరగతి విద్యార్థులకు సైతం అడ్మిషన్లు ఇవ్వడం జరిగిందని తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. అనుమతి లేకుండా పై స్థాయి తరగతులు కు ఎలా అడ్మిషన్ ఇస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. 

అనుమతులు ఇవ్వడం లేదంటూ డీఈఓకు ఫిర్యాదు..

మహమ్మద్ బాద్ మండల కేంద్రంలోని న్యూ బ్రిలియంట్ పాఠశాలకు పై తరగతులు చదువుకునేందుకు అనుమతి ఇవ్వడం లేద ని ఏమియు రాజు నాయక్ పై డిఈఓ కు విద్యార్థి సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. 8, 9, 10 తరగతులకు అనుమతులు ఇవ్వడంలో ఎంఈఓ డబ్బు లు అడుగుతున్నారని వారి ఫిర్యాదులో పేర్కొన్నారు.  ఫిర్యాదు చేసిన వారిలో పాఠశాల ప్రిన్సిపల్ దేవేందర్, గ్రాడ్యుయేషన్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి భరత్, ప్రశాంత్, వంశీ, ఆది విష్ణు ఉన్నారు.

సదుపాయాలు లేనిది అనుమతి ఎలా ఇస్తారు?

విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు పూర్తిస్థాయిలో ఉంటేనే ప్రభుత్వము ప్రైవేట్ పాఠశాలలకు అనుమతి ఇవ్వడం జరుగుతుంది. విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు లేకుండా పై తరగతి లకు అనుమతులు ఇవ్వాలంటే ఎలా కుదురుతుంది. ఉన్నతాధికారుల ఆదేశాలను తప్పకుండా పాటిస్తాం. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్న వాటిని పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాం.

ఉన్నత అధికారుల నుంచి న్యూ బ్రిలియంట్ పాఠశాలను మూసివేయాలని నోటీసులు జారీ చేయడం జరిగింది. ఆ నోటీసులను కూడా పాఠశాల నిర్వాహకులకు అందించడం జరిగింది. ఇప్పుడు అనుమతి అంటూ ఫిర్యాదు లు చేస్తే ఎలా సరిపోతుంది. 
 -రాజు నాయక్, ఏం ఈ ఓ, మహమ్మదాబాద్ మండలం 

ప్రమాద భరితంగా పాఠశాల

నేషనల్ హైవే 167 పక్కనే న్యూ బ్రిలియంట్ పాఠశాల ఉంది. విద్యార్థులకు చాలా ప్రమాద భరితంగా ఈ భవనం పక్కనే ప్రధా న రోడ్డు ఉంది. ఇప్పటికే పలుమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యా దు చేయడం జరిగింది. అనుమతులు లేకుండానే పై తరగతులకు అడ్మిషన్లు తీసుకుంటుండ్రు.

ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేయడంతో పాఠ శాలను రాబోయే విద్యా సంవత్సరం మూసివేయాలని నోటీసులు జారీ చేయడం జరిగింది. అనుకోకుండా విద్యార్థులకు ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు. 
 -దిడ్డికాడి గోపాల్, తెలంగాణ సమాచార హక్కుల పోరాట వేదిక సభ్యులు