calender_icon.png 30 December, 2024 | 1:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాజీని మరిచిపోయేదెలా!

10-12-2024 12:00:00 AM

ప్రేమ అనేది జీవితంలో అత్యంత భావోద్వేగాలలో ఒకటి. ఇద్దరు వ్యక్తులు రిలేషన్‌లో ఉన్నప్పుడు వారి మధ్య అనేక జ్ఞాపకాలు, భావోద్వేగాలు, కలలు ముడిపడి ఉంటాయి. అయితే సంబంధం విఫలమైనప్పుడు ఒక్కసారిగా నిరాశలో కూరుకుపోతారు. ఎందుకంటే రిలేషన్‌లో ఉన్న వ్యక్తిని అంతగా ఇజీగా మరిచిపోలేరు. ప్రేయసి/ప్రియుడికి సంబంధించిన ఇష్టమైన స్థలాలు, పాటలు, బహుమతులు.. ఇలా  ప్రతి చిన్న విషయం పాత జ్ఞాపకాల్లోకి తీసుకెళ్తుంది.

మాజీలను మరచిపోవాలంటే కొత్త అభిరుచులను అల వాటు చేసుకోవాలి. స్నేహితులతో సమయం గడపాలి. లేదా కొత్త ప్రదేశాలకు వెళ్లాలి. నిత్యం కొత్త విషయాలతో బిజీగా ఉండాలి. అలాగే సోషల్ మీడియాలో మాజీని అన్‌ఫాలో చేయాలి. తద్వారా జ్ఞాపకాలకు దూరంగా ఉండొచ్చు. జీవితంలో బాధలు, సంతోషాలు ఉంటాయి. ఈవిషయాన్ని దృష్టిలో పెట్టుకొని మనసును ధృడంగా ఉంచుకోవాలి. వ్యక్తిగత లక్ష్యాలు పెట్టుకొని విజయం సాధిస్తే.. ఆ సంతోషమే వేరుగా ఉంటుంది.