calender_icon.png 2 November, 2024 | 1:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓటర్ స్లిప్ రాలేదా.. ఇలా సింపుల్‌గా డౌన్‌లోడ్ చేసుకోండి

12-05-2024 12:30:51 PM

హైదరాబాద్: దేశంలో లోక్ సభ ఎన్నికలకు సర్వం సిద్దమైంది. తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాలకు, కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానంలో ఉప ఎన్నికకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాటు చేసింది. ఇప్పటికే అన్ని స్థానాల్లో ఓటర్ స్లిప్పులను పంచినట్లు అధికారులు తెలిపారు. ఓటర్ స్లిప్పులు రానీ వారు ఆందోళన చెందాల్సిన పని చేదు.మీ కంప్యూటర్, లేదా మీ సెల్ ఫోన్లో ఓటర్ స్లిప్ లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ఓటర్ స్లిప్ కోసం కంప్యూటర్ లేదా, పోన్ లో బ్రౌజర్ లో https://electoralsearch.eci.gov.in/ టైప్ చేయండి. అందులో మూడు ఆప్షన్లు కనిపిస్తాయి.

ఓటర్ ఐడీ, మొబైల్ నంబర్,  మీపేరు- ప్రాంతం తదితర వివరాలతో ఓటర్ సమాచారం తెలుసుకోవచ్చు.

ఈ సమాచారాన్ని డౌన్ లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకుని మీ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవచ్చు.

ఓటర్ కార్డు వివరాలు తెలుసుకోవడానికి మరో అవకాశం కూడా ఉంది. అదే ఓటర్ హెల్ప్ లైన్ యాప్ (Voter Helpline App). 

మీ మొబైల్ లో ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని అందులోని ఎలక్టోరల్  రోల్ సెర్చ్ ఆప్షన్ పై క్లిక్ చేసి వివరాలు ఎంటర్ చేసి ఓటర్ స్లిప్ పొందవచ్చు.

ఇందులో మొబైల్ నంబర్, ఓటర్ ఐడి, వీ వివరాలు సెర్చ్ ఆప్షన్ తో పాటు క్యూఆర్ కోడ్ స్కాన్ ఆప్షన్ అదనంగా ఉంటుంది.

ఓటర్ ఐడీ మీద ఉన్న క్యూఆర్ కోడ్ ను ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా స్కాన్ చేసి మీకు కావాల్సిన సమాచారం వచ్చేస్తోంది.

అలా వచ్చిన సమాచారాన్ని వాట్సాప్, మెయిల్ ద్వారా కూడా షేర్ చేసుకోవచ్చు. లేదా ప్రింట్ తీసుకొని ఓటు వేయవచ్చు. మెసేజ్ రూపంలో కూడా ఓటరు సమాచారాన్ని పొందవచ్చు. దాని కోసం 1950 నెంబరుకు ఎస్ఎంఎస్ చేయాల్సి ఉంటుంది. ECI అని టైప్  చేసి స్పేస్ ఇచ్చి ఓటరు ఐడి నంబర్ టైప్ చేయాల్సిఉంటుంది. కొద్దిసేపటికి మీకు పార్ట్ నంబర్, సీరియల్ నంబర్ లాంటి వివరాలు మొబైల్ కి మెసేజ్ లో వస్తాయి. మరి ఇంకేందుకు ఆలస్యం ఇప్పుడే ఓటర్ స్లిప్పులను డౌన్లోడ్ చేసుకోండి..