సమంత, కీర్తి సురేశ్ ఒకరినొకరు బాగా సపోర్ట్ చేసుకుంటూ ఉంటారు. సమంతపై ఇప్పటికే పలుమార్లు కీర్తి ప్రశంసలు కురిపించింది. తాజాగా మరోసారి సర్‌ప్రైజ్ వాయిస్ మెసేజ్‌తో పొగడ్తల వర్షం కురిపించింది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంతకు కీర్తి నుంచి సర్‌ప్రైజ్ మెసేజ్ వచ్చింది. “సమంత నీతో ఉన్న అను బంధాన్ని ఎలా వర్ణించాలో.. అసలు ఎక్కడి నుంచి ప్రారంభించాలో తెలియడం లేదు.
మనం కలిసింది కొన్నిసార్లే అయినా కూడా ఎన్నో ఏళ్ల క్రితం కలిసినట్టుగా అని పిస్తూ ఉంటుంది. మహిళల కోసం ముందుండే తత్వం, ఏ విషయంలోనైనా సూటిగా వ్యవహరించే తీరు నాకు స్ఫూర్తినిస్తూ ఉంటాయి. జీవితంలో నీకు ఎన్ని సవాళ్లు ఎదురైనా రెట్టింపు బలంతో ఎదుర్కొన్నావు. ఇలాం టి పోరాటాలు నీకు మాత్రమే సాధ్యం.
నిన్ను చూస్తుంటే చాలా గర్వంగానూ.. స్ఫూర్తిగానూ అనిపిస్తుంది. నిన్ను స్నేహితురాలు అనడం కంటే సోదరి అనడం సబబు” అని కీర్తి తెలిపింది. ప్రస్తు తం ‘బేబీ జాన్’ చిత్రంతో బాలీవుడ్‌లోకి కీర్తి ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం తమిళ వెర్షన్‌లో సమంత నటించిం ది. బాలీవుడ్‌కు కీర్తిని సిఫార్స్ చేసింది సమంతే.