ప్రస్తుత రిలేషన్‌షిప్‌లో ఫిజ్లింగ్ అనే పదం ఎక్కువగా వినిపిస్తోంది. ఒక భాగస్వామి ఎటువంటి కారణం, గొడవ పడకుండా అకస్మాత్తుగా దూరమైనప్పుడు ‘ఫిజ్లింగ్’ అంటారు. ఒకవ్యక్తి తన భాగస్వామితో సంబంధాన్ని క్రమంగా తగ్గించుకోవడం ఫిజ్లింగ్ కిందకు వస్తుంది. అయితే ఫిజ్లింగ్‌ను గుర్తించడం అంత సులభం కాదు. గతంలో ఎక్కువగా ఫోన్ కాల్స్ మాట్లాడే భాగస్వామి.. క్రమక్రమంగా ఫోన్ చేయడం మానుకుంటారు.
ఫోన్ సందేశాలకు కూడా తక్కువ రెస్పాండ్ అవుతారు. ఫిజ్లింగ్ తర్వాత భాగస్వామిని కలవడానికి ప్రయత్నించినప్పుడు సాకులు చెబుతూ దూరంగా ఉంటారు. భాగస్వామి ఇష్టాలకు ప్రాధాన్యం కూడా ఇవ్వరు. ఇతరులకు దగ్గరవుతూ భాగస్వామిని నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే ఈ సమస్యను ఎదుర్కోవాలంటే కచ్చితంగా భాగస్వామితో డైరెక్ట్‌గా మాట్లాడాలి. ప్రవర్తనలో ఏమైనా లోపం ఉందా? అడిగి తెలుసుకోవాలి.
ఒకవేళ అవతలివారి నుంచి స్పందన రాకపోతే సంబంధాన్ని తుంచుకోవద్దు. ఇరువురి కుటంబసభ్యుల సలహాలు, సూచనలు తీసుకొని సమస్యను పరిష్కరించుకోవడం ఉత్తమం.