calender_icon.png 8 November, 2024 | 3:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాగులు దాటేదెట్లా..?

30-06-2024 01:02:49 AM

  • జిల్లాలో పలు చోట్ల ప్రమాదకరంగా లోలెవల్ బ్రిడ్జీలు

వరద ఉధృతికి ఏదో ఒకచోట మృత్యుఘోష

కొన్నిచోట్ల రోజుల తరబడి రాకపోకలు  బంద్

వర్షాకాలం సమీపిస్తుండటంతో భయాందోళనలో ప్రజలు

సూర్యాపేట, జూన్ 29 (విజయక్రాంతి) : వానలు కురిసి వాగులు పొంగితే అందరికీ సంబరమే. కానీ జిల్లాలో కొన్ని ప్రాం తాల ప్రజలకు భారీ వర్షాలంటే భయం పుడుతోంది. వరుసగా వర్షాలు పడుతున్నాయం టే చాలు వాగులు దాటేందుకు ఎన్నాళ్లు మాకీ కష్టాలు  అంటూ కొన్ని ప్రాంతాల రైతులు, ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బడికి, గుడికి, బావి కాడికి ఇలా  ఊరి పొలిమేర దాటాలంటే బిక్కుబిక్కుమంటున్నారు. జిల్లాలోని కొన్ని ప్రాం తాలలో కొన్ని దశాబ్దాలుగా ప్రతి వానకాలంలో ఇదే పరిస్థితి నెలకొంటున్నా పట్టించుచుకునే నాథుడే లేకుండా పోతున్నారని లోలెవల్ బ్రిడ్జీలు, వాగుల అవతలి గ్రామాల ప్రజలు వాపోతున్నారు. 

ప్రమాదకరంగా వాగులు

జాజిరెడ్డిగూడెం మడలం తిమ్మాపురం సంగెం రహదారిపై కోడూరు, సంగెం వద్ద  ఉన్న లోలెవల్ బ్రిడ్జి మీదుగా ఏటా ప్రమాదకరంగా నీరు ప్రహహిస్తుంటుంది. వర్షకాలం వచ్చిందంటే ఇక్కడ వాగులు దాటడం కష్టమే. ఒక్కోసారి వారం, పది రోలజు పాటు ఊరు విడిచే పరిస్థితి ఉండదు. ఇదే రహదారికి అనుసం ధానంగా ఉన్న కొమ్మాల అర్వపల్లి రోడ్డుపై కొమ్మాల వద్ద ఇదే పరిస్థితి ఉంటుంది. తుంగతుర్తి మండలం  కేశవాపురం అన్నారం రోడ్డుపై  వెలుగుపల్లి సమీపంలో ప్రవహించే బంధంవాగులో గతంలో నీటి ప్రవాహానికి కొట్టుకపోయి గతంలో కొందరు మరణించిన సంఘటనలు ఉన్నాయి.

చివ్వెంల మకుందాపురం రహదారిపై నశీంపేట సమీపంలో అత్యంత ప్రమాదకరంగా నీరు ప్రవహిస్తుంది. ఇక్కడ ఇటీవలే బ్రిడ్జీ నిర్మించారు. ఇది ఎంత మేరకు ఉపయోగపడనున్నదో చూడాలి. ఇవే కాకుండా జిల్లాలో మొత్తం 12 చోట్ల  రోడ్లపై ప్రమాదకరంగా ప్రవహించే వాగులను అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు ఒక్క చోట మాత్రమే బ్రిడ్జీ నిర్మాణం జరిగింది. మిగిలిన చోట ఈ వానకాలం కూడా ప్రజలకు కష్టాలు తప్పవు. 

ఏళ్లు గడుస్తున్నా... 

జిల్లాలోని సూర్యాపేట, తుంగతూర్తి నియోజకవర్గాలలో అత్యధికంగా వాగు లు దాటేందుకు ప్రజలు అవస్థలు పడా ల్సి వస్తోంది. దశాబ్దాల క్రితం అప్పటి అవసరాల మేరకు లోలెవల్ బ్రిడ్జీలు నిర్మించి వదిలేశారు. తర్వాత వాటి ఎత్తు పెంచకపోవడం.. ప్రమాదాలు జరుగతునా కొత్త బ్రిడ్జీలు నిర్మిం చకపో వడంతో వానకాలం వచ్చిదంటే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. జిల్లాలోని జాజిరెడ్డిగూడెం, తుంగతూర్తి, నూతనకల్,  ఆత్మకూర్ (ఎస్), చివ్వెంల, మద్దిరాల, మోతే, పెన్‌పహాడ్,  మఠంపల్లి, గరిడేపల్లి, నూతనకల్ మండ లాలలో వానకాలం వస్తే వాగుల కష్టా లు చెప్పనలవి కాదు.  కొనేళ్లుగా ఇదే పరిస్థితి ఉన్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఇప్పటికీ ఎంతోమంది నాయకులు హామీలు ఇస్తున్నా.. అమలుకు నోచుకోవడం లేదు.