హైదరాబాద్, నవంబర్ 7 (విజయక్రాంతి): 2008 డీఎస్సీలో నష్టపోయిన 2,367 మంది అభ్యర్థులకు కాంట్రాక్టు టీచర్లుగా నియమించే ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. నాడు నష్టపోయిన వారిలో పేర్లు నమోదు చేసుకున్న వారికి ధ్రువపత్రాలను పరిశీలించి, ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రక్రియను శుక్రవారం వరకు పూర్తి చేసేలా ఒక అధికారిని పరిశీలకుడిగా నియమించారు.
అయితే వీరు గతంలో ఉమ్మడి పది జిల్లాలకు ఎంపికయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 33 జిల్లాలుండటంతోవారిని ఎలా సర్దుబాటు చేయాలి? ఏ ప్రాతిపదికన ఉద్యోగాలు కేటాయించాలి? అనే దానిపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నట్టు తెలిసింది.