calender_icon.png 31 October, 2024 | 2:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సేనాపతి వయసెంత..?

28-06-2024 12:05:00 AM

సుప్రీమ్ యాస్కిన్‌గా గురువారం తెరమీదకొచ్చిన కమల్ హాసన్ మరో రెండు వారాల్లో సేనాపతిగా సందడి చేయనున్నారు. కమల్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వం వహించిన ‘భారతీయుడు చిత్రం జూలై 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేయగా, వీటిలో కమల్ చురుకుగా పాల్గొంటున్నారు. ఇరవై ఎనిమిదేళ్ల క్రితం విడుదలైన ‘భారతీయుడు’ చిత్రంలో వృద్ధుడిగా సేనాపతి పాత్రలో నటించిన కమల్, మరోమారు ఆ పాత్రలో కనపడనుండగా, ‘అప్పటికే ముసలివాడైన సేనాపతి ఇప్పటి వయసెంత? ఈ వయసులో ఇలాంటి పోరాటాలు చేయడం సాధ్యమే నా?’ అని ఓ విలేఖరి ప్రశ్నించారు.

దీనికి బదులుగా ‘వంద పైనే ఉండవచ్చు’ అన్న కమల్ వ్యక్తిగతంగా తాను ఆ వయసులోనూ నటిస్తూనే ఉంటానని సమాధానమిచ్చారు. పక్కనున్న దర్శకుడు శంకర్ వెంటనే అందుకుని ‘జపాన్‌లో ఓ మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ 120 వయసులోనూ గాల్లో ఎగురుతూ విన్యాసాలు చేశారని, దానికి వారి సాధన ముఖ్యమని చెబుతూ.. సినిమాలో కూడా సేనాపతి అలాంటి మార్షల్ ఆర్ట్స్ విద్య అయిన వర్మకళ అభ్యసించడం మూలాన ఇంత వయసు లోనూ ఆ రకమైన పోరాటాలు చేయగలర’ని జవాబిచ్చారు. సిని మా మూడు భాగాలుగా చేయడంపై ఆయన స్పష్టతనిస్తూ.. తొలి భాగం ఒక్క రాష్ట్రంలో జరిగితే, తర్వాతి కథ దేశం అంతటా ఉంటుందని, ఆ కారణంతోనే దీన్ని మూడు భాగాలుగా మలచినట్టు చెప్పుకొచ్చారు.