* పెర్త్‌లో ఘటన
పెర్త్, డిసెంబర్ 28: బాక్సింగ్ డే సందర్భంగా ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో ఓ షాప్ యజమాని ప్రకటించిన ఆఫర్ తొక్కిసలాటకు దారి తీసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పెర్త్‌లోని ఓ బట్టల దుకాణ యజమాని వందలాది మందికి టీషర్టులు గివ్ అవే (ఉచితంగా అందించడం) ఇస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో జనాలు ఎగబడ్డారు.
షాప్ తెరవగానే లోపలికి తోసుకుంటూ వెళ్లారు. ఈ ఘటనలో కొంత మంది గాయపడ్డారు. దుకాణ యజమాని మాట్లాడుతూ.. కస్టమర్లకు ఉచితంగా ఏదైనా ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఇలా చేసినట్లు వివరించాడు. 400 రకాల వస్తువులు కేవలం 30 సెకండ్లలోనే ఖాళీ అయ్యాయని తెలిపాడు. ఈ ఘటనలో ఎవరికీ పెద్దగా గాయాలు కాలేదన్నాడు.