calender_icon.png 12 January, 2025 | 1:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇప్పటి కోటి రూపాయలకు ఏండ్లు గడిచిన తర్వాత విలువెంత?

01-12-2024 12:00:00 AM

ఒకప్పుడు లక్షాధికారి అంటే గొప్ప ధనవంతుడు, 20 ఏండ్ల క్రితం కోటీశ్వరుడు అం టే కుబేరుడే. ఇప్పుడు లక్షలు, కోట్లు కాదు.. బిలియనీర్లే శ్రీమంతుల కింద లెక్క. అఫ్‌కోర్స్! మధ్యతరగతికి ప్రస్తుతం కోటి రూపా యిలే పెద్ద లక్ష్యం. భవిష్యత్తులోనైనా అంతమొత్తాన్ని సంపాదించాలని లేదా ఆ లక్ష్యసా ధనకు తగినరీతిలో ఖర్చులు తగ్గించుకుని, పొదుపు చేయాలని పలువురు ప్రయత్నిస్తుంటారు. కానీ 20 ఏండ్లు, 30 ఏండ్లకు కోటి రూపాయల విలువ దారుణంగా పడిపోతుందని తెలుసా? అది ఎలాగో తెలుసుకుందాం. 

ద్రవ్యోల్బణమే పెద్ద విలన్

ప్రతీ ఏటా ద్రవ్యోల్బణం పెరగడాన్ని మనం చూస్తునే ఉన్నాం. వస్తువులు, సేవల ధరలు ఎప్పటికప్పుడు పెరిగిపోతున్నందున, రోజులు గడిచేకొద్దీ డబ్బు విలువ తగ్గిపోతుంది. ఇప్పుడు కోటితో కొనదగ్గవాటిని తర్వాతికాలంలో కొనలేము. అంటే మీ వద్దనున్న సొమ్ముకు కొనుగోలు శక్తి తగ్గిపో తుందన్న మాట. అందుచేత పదవీ విరమణ తర్వాత జీవితాన్ని ప్లాన్ చేసుకునేటపుడు ఇది తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఇప్పు డు రూ.1 కోటి పెద్ద మొత్తమే అన్పించవచ్చు. భవిష్యత్తులో దీనికి ఇంతే విలువ ఉండదు. 

ఏండ్ల తర్వాత కోటి విలువ ఇది..

గత మూడేండ్లుగా దేశంలో వార్షిక ద్రవ్యోల్బణం రేటు సగటున 6 శాతం ఉన్నది. అంటే ప్రతీ ఏడాది ధరలు 6 శాతం చొప్పున పెరుగుతూ పోతున్నాయి. ఇలా పెరుగుతున్న ద్రవ్యోల్బణం మీవద్దనున్న డబ్బు విలువను తగ్గించివేస్తుంది. 6 శాతం వార్షిక ద్రవ్యోల్బణం రేటు భవిష్యత్తులో కొనసాగితే  ప్రస్తుతం మీ వద్దనున్న కోటి రూపాయిలు విలువ ఇలా పడిపోతుంది.

20 ఏండ్ల తర్వాత రూ.1 కోటి విలువ

ఇరవై ఏండ్లు గడిచిన తర్వాత కోటి రూపాయిలకు ఇప్పుడున్నంత విలువ ఉండదు. ప్రతి ఏడాది పెరిగే 6 శాతం ద్రవ్యోల్బణం కారణంగా దాని విలువ రూ.31.18 లక్షలకు పడిపోతుంది.

30 ఏండ్ల తర్వాత రూ.1 కోటి విలువ

ముప్ఫు ఏండ్లు గడిచిన తర్వాత కోటి రూపాయిల విలువ మరింత క్షీణిస్తుంది. ఇప్పుడు రూ.1 కోటికి ఉన్న కొనుగోలు శక్తి 30 ఏండ్లకు రూ.17.41 లక్షలకు తగ్గుతుంది.

50 ఏండ్ల తర్వాత రూ.1 కోటి విలువ

అర్థశతాబ్దం గడిచిన తర్వాత కోటి రూపాయిల విలువ మరింత దారుణంగా తగ్గుతుంది. ఇప్పటి రూ.1 కోటికి అప్పుడు దక్కే విలువ రూ.5.43 లక్షలు మాత్రమే. ద్రవ్యోల్బణం ఏ ఏడాదికాఏడాది చక్రగ తిన పెరగనున్నందున, డబ్బు విలువ క్షీణిస్తుంది. 

ద్రవ్యోల్బణాన్ని తలదన్నే రాబడులిచ్చేవాటిలో మదుపు చేయాలి

మనం సంపాదించే సొమ్ము విలువను భవిష్యత్తులోనూ పొందాలంటే ద్రవ్యోల్బణానికి సరితూగే లేదా అంతకు మించి రాబడినిచ్చే ఆస్తుల్లోనూ, పొదుపు లేదా పెట్టుబడి సాధనాల్ని ఎంచుకోవాలని పర్సనల్ ఫైనాన్స్ నిపుణులు సూచిస్తున్నారు. దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల సాధనకు ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రణాళిక రూపొందించుకోవాలి.