calender_icon.png 30 November, 2024 | 3:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పండిన పంట ఎంత? కొన్న ధాన్యం ఎంత?

30-11-2024 01:08:55 AM

కాంగ్రెస్ పాలనలో దండగగా వ్యవసాయం: కేటీఆర్ 

హైదరాబాద్, నవంబర్ 29 (విజయక్రాంతి): పండగలాంటి వ్యవసాయం.. కాంగ్రెస్ పాలనలో మళ్లీ దండగగా మారిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రాష్ట్రంలో పండిన పంట ఎంత? కొనుగోలు చేసిన ధాన్యం ఎంత? ఇందులో రూ.500 బోనస్ ఎంత ధాన్యానికి చెల్లించారో ప్రభు త్వం చెప్పాలని ప్రశ్నించారు.

కొన్నది పిసరంత అని,  కోతలు మాత్రం కొం డం త ఉన్నాయని శుక్రవారం ఎక్స్ వేదికగా ఎద్దేవాచేశారు. 1.53 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి వస్తే, 5,19,605 క్వింటాళ్ల సన్న వడ్లను క్వింటాలుకు రూ.500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేసినట్టు సీఎం రేవంత్ చెబుతున్నారని, ఇదే నిజమైతే రైతులకు దక్కిన బోనస్ రూ.25.98 కోట్లు మాత్రమేనని పేర్కొన్నారు.

రైతుభరోసా ఎకరానికి ఏడాదికి రూ.15 వేల చొప్పున రైతులకు కోటి 50 లక్షల ఎకరాలకు ఇప్పటి వరకు ఎగ్గొట్టిన సొమ్ము ఎంతో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులకు ఎకరాకు రూ.15 వేల చొప్పున, రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేల చొప్పున ఇస్తానని మోసం చేశారని మండిపడ్డారు.