calender_icon.png 29 December, 2024 | 12:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోజుకు ఎంత ప్రోటీన్ అవసరం?

04-12-2024 03:29:15 AM

ప్రోటీన్లు శరీరంలో చాలా పనులు చేస్తాయి. కండరాల పెరుగుదలకు, రోగనిరోధక శక్తి పనిచేయడానికి, కణాలు దెబ్బ తిన్నప్పుడు రిపేర్ చేసు కోవడానికి, రకరకాల ఎంజైమ్స్, హార్మోన్స్ తయారీకి సరిపడా ప్రోటీన్లు అవసరం. దెబ్బ తగిలినా, ఆపరేషన్ అయినా పుండు మానాలంటే సరిపడా ప్రోటీన్లు కావా లి.

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రకారం.. పెద్దలకు రోజువారీ ప్రోటీన్ కిలోకు 0.83 గ్రాములుగా నిర్ణయించింది. అంటే శరీర బరువు 65 కిలోలు ఉంటే.. రోజుకు కనీసం 54 గ్రాముల ప్రోటీన్ అవసరం ఉంటుంది. ప్రతి వ్యక్తి సగటున 15 నుంచి 25 గ్రాములు ప్రోటీన్‌ను ఆహారంగా తీసుకోవాలని చెబుతున్నారు డాక్టర్లు.

అయితే రోజుకి కనీసం ఒక గంటసేపు వ్యాయాయం, నడక, లేదా నిల్చుని పనిచేసేవారు, బరువులు ఎత్తేవారికి రోజుకి 60 నుంచి 72 గ్రాముల ప్రోటీన్లు అవసరం ఉంటుంది. గర్భిణులు, బాలింతలకు రోజుకు 10 నుంచి 15 గ్రాముల అదనపు ప్రోటీన్ అవసరమవుతుంది. శరీరానికి బలమైన ప్రోటీన్లు అందాలంటే క్రమం తప్పకుండా గుడ్లు, మాంసాహారం, చేపలు, పాలు, పెరుగు, వాల్నట్స్, గుమ్మడికాయ గింజలను తీసుకోవాలని చెబుతున్నారు డాక్టర్లు.