calender_icon.png 19 January, 2025 | 9:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాగ్ అశ్విన్‌కు సొంతూరిపై ఎంత ప్రేమో!

11-08-2024 12:11:46 AM

నాగర్ కర్నూల్, ఆగస్టు 10 (విజయక్రాంతి): ‘కల్కి’ చిత్రంతో రికార్డులు సృష్టించిన డైరెక్టర్ నాగ్ అశ్విన్ సొంత ఊరిపై ప్రేమను చాటుకున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం ఐతోల్ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల నిర్మాణం కోసం ఆయన సొంతంగా రూ.66 లక్షలు ఖర్చుచేశారు. నూతనంగా నిర్మించిన 4 అదనపు తరగతి గదుల ప్రారంభోత్సవం శనివారం నిర్వహించగా, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నాగ్ అశ్విన్ సేవలను వారు కొనియాడారు. కార్యక్రమంలో నాగ్ అశ్విన్ తల్లి జయంతిరెడ్డి, తండ్రి జయరామ్‌రెడ్డి, మాజీ సర్పంచ్ ఇందుమతి, కుటుంబ సభ్యులతోపాటు డీఈవో గోవిందరాజులు, ఎంఈవో భాస్కర్‌రెడ్డి, హెచ్‌ఎం భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.