calender_icon.png 22 January, 2025 | 10:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎవరెవరికి ఎంతెంత ముట్టింది...!

22-01-2025 02:07:07 AM

బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్

వనపర్తి, జనవరి 21 ( విజయక్రాంతి ) :  గతేడాది స్నేహా కంపెనీ ప్రభుత్వ భూమిని ఆక్రమిం చిందని చెప్పి. ఇప్పుడు లేదంటారా అని బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ మండల రెవెన్యూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళ వారం స్థానిక తహసీల్దార్ కార్యాల యంలో తహసిల్దార్ అందుబాటులో లేకపోవటంతో గిర్దావరితో మాట్లాడిన అనంతరం మీడియాతో మాట్లాడారు.

ఎవరి ప్రయోజనాలు కాపాడేందుకు పెద్దమందడి రెవెన్యూ అధికారులు ప్రయత్నిస్తున్నారో అర్థం కావడం లేదని, ఆక్రమణ లేకపోతే అప్పుడు ఎందుకు నోటీసులు ఇచ్చారు.. మచ్చిక చేసుకునేందుకా? మామూళ్లు దండుకునేందుకా? అని ఆయన ప్రశ్నించారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్నా మాలాంటి వారు అడ్డుకుంటున్నా చర్యలు తీసుకోవడానికి ఎందుకు జంకుతున్నారని,

సర్వే నెంబర్ 22/1 హద్దులు కంపెనీ ప్రతినిధులు చెప్పినట్లు నిర్ణయించడం సిగ్గుచేటని, డబ్బులు పడేస్తే తప్పు ఒప్పవుతుందా? అని ఆయన నిలదీశారు.  ఈ కార్యక్రమంలో బిసి పొలిటికల్ జెఎసి జిల్లా అధ్యక్షుడు వనం తిరుపతయ్య యాదవ్,  రాష్ట్ర కార్యదర్శి వివి గౌడ్, మండల అధ్యక్షుడు అన్నెల రమేష్ సాగర్, జిల్లా కార్యదర్శి బత్తుల జితేందర్ గౌడ్, మదనాపూర్ మండల అధ్యక్షుడు మహేందర్ నాయుడు, నాయకులు దేవర శివ, గౌతమ్ శంకర్, రామన్ గౌడ్, నాగరాజు యాదవ్, వసంత చారి తదితరులు పాల్గొన్నారు.