14-02-2025 12:00:00 AM
డాక్టర్ తిరుణహరి శేషు :
తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశ పెట్టబో తున్న రెండవ పూర్తిస్థాయి బడ్జెట్ స్వరూ పం ఎలా ఉండబోతుంది, ఏ అంశాలకు, ఏరంగాలకు, ఏ పథకాలకు ఎంత ప్రాధాన్యత దక్కుతుంది అనే అంశాలపై చర్చ ప్రారంభమైంది. గత బడ్జెట్‌లో అభివృద్ధి సంక్షేమం ప్రాతిపదికగానే కేటాయింపులు జరిగాయి.
రాష్ట్ర అభివృద్ధికి కీలక రంగాలైన వ్యవసాయం దాని అనుబంధ రంగాలకు, గ్రామీణ అభివృద్ధి, సాగు నీటిపారుదల, విద్యుత్, విద్యా రంగాలతో పాటు వివిధ వర్గాల సంక్షేమానికి, సంక్షేమ పథకాలకు, 6 గ్యారెంటీలకు నిధుల కేటాయిం పులో ప్రాధాన్యత దక్కింది. బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క మా ప్రభుత్వానికి బడ్జెట్ అంటే అంకెల సమాహారం కాదు అది విలువలు, ఆశల వ్యక్తీకరణ అని చెప్పారు.
అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవే శ పెట్టిన మొదటి పూర్తిస్థాయి బడ్జెట్ ఏ మేరకు లక్ష్యాలను చేరుకుందనే దానిపైనే ప్రభుత్వ విశ్వసనీయత ఆధారపడి ఉం టుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్ లక్ష కోట్ల రూపాయలు దాటితే 2021-22 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశ పెట్టిన బడ్జెట్ రెండు లక్షల కోట్ల రూపాయలను దాటిపోయింది.
ఇక కాంగ్రె స్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2.91 లక్షల కోట్ల రూపాయలతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రాష్ట్రం లో ప్రభుత్వాలు లక్షల కోట్ల రూపాయలతో బడ్జెట్‌లను ప్రవేశపెడుతున్నా ప్రభుత్వాలు కేటాయింపులను ఖర్చు చేయడంలోను, బడ్జెట్ లక్ష్యాలను చేరుకోవడంలో నూ వెనుకబడి పోతున్నాయి. 2.91 లక్షల కోట్ల రూ॥ గత బడ్జెట్ అంచనాలలో కేవలం 2.31 లక్షల కోట్లను ఖర్చు చేయగలిగింది. అంటే దాదాపు 60 వేల కోట్ల రూ॥ బడ్జెట్ నిధులను ప్రభుత్వం ఖర్చు చేయలేకపోయిందనే చెప్పాలి.
గ్యారెంటీల అమలుకు నిధులే సమస్య
దక్షిణాదిలో కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో, తెలంగాణలో అధికారంలోకి రావడానికి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలే ప్రధాన కారణం. కర్ణాటకలో ఐదు గ్యారెంటీలతో అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాసనసభ ఎన్నికల సందర్భంగా మేము అధికారంలోకి వస్తే మహా లక్ష్మి, రైతు భరోసా, గృహ జ్యోతి, చేయూత, ఇందిరమ్మ ఇళ్లు, యువవికాసం లాంటి 6 గ్యారెంటీల క్రింద 14 హామీలను ఇవ్వడం జరిగింది.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుపులో ఆరు గ్యారెంటీలు కీలక పాత్రనే పోషించాయనేది వాస్తవం. అధికారంలోకి వచ్చిన 100 రోజులలోనే 6 గ్యారెంటీలను అమలు చేస్తామని కాం గ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఎన్నికలలో గెలిచి అధికారం చేపట్టిన 24 గంటలలోనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఆరోగ్య శ్రీ పరిమితిని ఐదు లక్షల నుండి పది లక్షల రూపాయలకు పెంచే రెండు హామీలను అమలులోకి తీసుకురావటం జరిగింది.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆరు గ్యారెంటీల అమలు కోసం లోక్ సభ ఎన్నికలకు ముం దు ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌లో 53 వేల కోట్ల రూపాయల నిధులను కేటాయిస్తే లోక్ సభ ఎన్నికల అనంతరం ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్‌లో మా త్రం ఆరు గ్యారెంటీల అమలు కోసం 47 వేల కోట్ల రూపాయలను మాత్రమే బడ్జెట్ లో కేటాయించారు.
వాస్తవంగా 6 గ్యారెంటీలను పూర్తిస్థాయిలో అమలు చేయడానికి ప్రభుత్వానికి 70 నుండి 80 వేల కోట్ల రూపాయల వరకు ఖర్చవుతుందనేది అంచనా. కానీ గ్యారెంటీల అమలు కోసం బడ్జెట్‌లో సగం నిధులు కూడా కేటాయించకపోవటం వలన అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతున్నా ఆరు గ్యారెంటీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేకపో తోందనే విమర్శలను ఎదుర్కొంటుంది.
గ్యారెంటీలలో మహాలక్ష్మి గ్యా రెంటీ కింద మహిళలకు నెలకు 2,500, చేయూత గ్యారెంటీ క్రింద వృద్ధులకు 4000 రూపాయల పెన్షన్ లాంటి కీలక హామీలను నెరవేర్చడానికి రాబోయే బడ్జెట్‌లో నిధులు కేటాయించాల్సి ఉంటుం ది. ఇప్పటికే ఆయా వర్గాల నుండి ప్రభుత్వంపై అసంతృప్తి కూడా వ్యక్తం అవుతుం ది.
సంక్షేమ పథకాల అమలు తీరు ఏ విధంగా ఉం టుందంటే చేయూత పెన్షన్ గ్యారెంటీని అమలు చేయాలంటే 22 వేల కోట్ల రూపాయలు అవసరమవుతుందని గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రతిపాదనలు పంపితే ప్రభుత్వం బడ్జెట్‌లో ఆ గ్యారెంటీకి 14,861 కోట్ల రూపాయలను మాత్రమే కేటాయించింది. కానీ ప్రభుత్వం మాత్రం రాష్ట్రంలో 45 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నామని చెబుతోంది.
అర్హత ఉండి పెన్షన్ రాని పది లక్షల మందికి పెన్ష న్ ఇవ్వటానికి నిధులు కేటాయించటం లేదనేది వాస్త వం. మరి రాబోయే బడ్జెట్ లోనై నా ఈ గ్యారెంటీల అమలుకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో నిధులు కేటాయించాలని పేద ప్రజలు కోరుకుంటున్నారు. యువ వికాసం లాంటి గ్యారెంటీని అమలులోకే తీసుకు రాలేదు.
ఇందిర మ్మ ఇళ్ల ఎంపికలో గందరగోళం, గృహజ్యోతి, రైతు భరోసా అమలు చేస్తు న్నా ప్రభుత్వానికి రావలసిన పేరు రావ డం లేదు. కాబట్టి ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను పూర్తిస్థాయిలో అమలు చేయటానికి బడ్జెట్‌లో 60 నుండి 70 వేల కోట్ల రూపాయల నిధులను కేటాయించటంతోపాటు అమలు కోసం ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తే గ్యారెంటీలను ప్రజలకు చేరువ చేయగలుగుతుంది.
కేటాయింపులు పెరిగేనా!
సంక్షేమరంగానికి ప్రథమ ప్రాధాన్యతగా కాంగ్రెస్ ప్రభుత్వాలు బడ్జెట్ కేటా యింపులు చేస్తుంటాయి. 2024-25 రాష్ట్ర బడెట్‌లో ఎస్సీ, ఎసీ,్ట బీసీ, మైనార్టీల సంక్షేమానికి 23,810 కోట్లు, ఎస్సీ, ఎస్టీల ప్రత్యేక అభివృద్ధి నిధులు (ఎస్ డి ఎఫ్) 39,823 కోట్లు అంటే మొత్తం బడ్జెట్ లో సంక్షేమ రంగానికి 63,633 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించింది.
ఇది మొత్తం బడ్జెట్‌లో 22 శాతం కానీ గత కొం తకాలంగా రాష్ట్ర బడ్జెట్‌లో సంక్షేమ రంగానికి కేటాయింపులు ఘనంగా ఉంటున్నప్ప టికీ కేటాయించిన నిధులను ఖర్చు చేయడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరి స్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతు న్నాయి. గత ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల ప్రత్యే క అభివృద్ధి నిధులలో 48 శాతం కూడా ఖర్చు చేయలేదు.
ప్రభుత్వం బడ్జెట్‌లో సీఎం దళిత సాధికారిత పథకానికి కేటాయించిన 2000 కోట్లలో ఇంతవరకు ఒక్క రూపాయి నిధులను కూడా ఖర్చు చేయలేదు. అలాగే బీసీల సంక్షేమానికి ప్రతి బడ్జెట్‌లో 20వేల కోట్లు ఖర్చు చేస్తామని హామీ ఇచ్చి బడ్జెట్‌లో కేవలం 9,200 కోట్ల రూపాయలను కేటాయించారనే అసంతృప్తి కూడా వ్యక్తం అవుతోంది.
ప్రాధాన్యతా రంగాల మాటేమిటి?
రాబోయే బడ్జెట్‌లో వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి , సాగునీరు, ఇంధనం, పురపాలక శాఖ, విద్య, వైద్య రంగాలులాంటి కీలక రంగాలకు నిధుల కేటాయిం పులను పెంచాల్సిన అవసరం ఉంది. గ్రామీణ అభివృద్ధి రంగానికి ఓటు ఆన్ అకౌంట్ బడ్జెట్, పూర్తి స్థాయి బడ్జెట్ కేటాయింపులలో పదివేల కోట్ల రూపాయల వ్యత్యాసం ఉంది.
ప్రస్తుత బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి కేటాయించిన 49 వేల కోట్ల రూపాయలకంటే రాబోయే బడ్జెట్‌లో ఎక్కువ నిధులను కేటాయించాలి అలాగే విద్యారంగానికి తొలి బడ్జెట్‌లో 10 శాతం నిధులు కేటాయిస్తే ప్రస్తుత బడ్జెట్‌లో 7.3 శాతం నిధులనే కేటాయించారు.
రాబోయే బడ్జెట్‌లో వ్యవసాయ, నీటి పారుదల, గ్రామీణ అభివృద్ధి, విద్యా రంగాలకు, సంక్షేమ రంగాని కి, 6 గ్యారెంటీలకు సంతృప్తికరంగా నిధులు కేటాయిం పు జరగాలంటే బడ్జెట్ అంచ నా వ్యయం దాదాపు రూ.3.30 లక్షల కోట్లుగా ఉండా లి కానీ గత బడ్జెట్ అంచ నా వ్యయమైన 2.91 లక్షల కోట్ల రూపాయలకే చేరుకోలేదు కాబట్టి ప్రభుత్వం వనరులను సమ కూర్చుకునే మార్గాలపై దృష్టి పెట్టాలి.
- వ్యాసకర్త సెల్:9885465877