కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): జిల్లా పాలన ఇంచార్జ్ లకు కేరాఫ్ గా మారిందని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గుడిసెల కార్తీక్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని తమ కార్యాలయంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు టీకానంద్, టిఏజిఎస్ జిల్లా అధ్యక్షురాలు మాల శ్రీ తో కలసి ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. విద్యాశాఖ మైనారిటీ క్రీడా శాఖలతో పాటు వివిధ శాఖలలో ఇన్చార్జి అధికారుల పాలనతో విద్యా వ్యవస్థ పూర్తిగా నాశనం అవుతుందని విమర్శించారు. జిల్లాస్థాయి అధికారులను నియమించాలన్న సోయిలో ప్రభుత్వం లేదని ఆరోపించారు. డిఈవో ఇన్చార్జిగా ఉండడంతో విద్యా వ్యవస్థ పూర్తిగా కుంటుబడి పోతుందన్నారు. రెగ్యులర్ అధికారులను నియమించకుంటే పెద్ద ఎత్తిన ఆందోళన కార్యక్రమాలు చేపట్టడంతో పాటు కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరాహార దీక్షలు చేయడానికి అయినా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.