22-03-2025 12:57:37 AM
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
హైదరాబాద్, మార్చి 21(విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ ఎంత మంది కోసమో చెప్పాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రశ్నించారు. శుక్రవారం ఆయన మండలి లో మాట్లాడారు. కులగణన సర్వేలో రాష్ట్ర జనాభా 3.70కోట్ల మంది అని చెప్పారని, కానీ సోషియో ఎకనామిక్ సర్వేలో జనాభా 4.21 కోట్లుగా పేర్కొన్నారని తెలిపారు. ఈ సందర్భంగా బడ్జెట్‌ను ఎంతమంది కోసం ప్రవేశపెట్టారో చెబితే బాగుంటుందని డిమాండ్ చేశారు.