calender_icon.png 20 April, 2025 | 4:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహనీయుల విగ్రహాలపై ముసుగులు ఇంకెన్నాళ్లు..

15-04-2025 01:35:38 AM

బీజేపీ అధ్యక్షుడు సుగుర్తి జగదీశ్వరచారి

తిమ్మాపూర్ ఏప్రిల్ 14 విజయ క్రాంతి:   మండల కేంద్రంలో గల ఆర్ టి సి బస్టాండ్ పరిధిలో నెలకొల్పిన అంబేద్కర్ విగ్రహానికున్న ముసుగును తొలగించడం లో స్థానిక ఎమ్మెల్యే కు చిత్తశుద్ధి లేదని తిమ్మాపూర్ బీజేపీ అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వరచారి ఆరోపించారు. అంబేద్కర్ 134 వ జయంతి సందర్బంగా సోమవారం బీజేపీ మండల శాఖ పక్షాన ఇందిరానగర్ లోని అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళుర్పించారు.

మూడేళ్లుగా అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరణ చేయకుండా అగౌరవ పరుస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు జై మహాత్మా, జై భీమ్, జై సంవిధాన్ అనే కార్యక్రమం నిర్వహించడం ఏ మాత్రం సమంజసం కాదని అన్నారు.ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్న దళితుల సంక్షేమం కోసం ఆలోచించాలని కోరారు.అట్టడుగు ప్రజల సంక్షేమమే ద్యేయంగా పనిచేస్తున్న  బీజేపీ ని విమర్శించడం కంటే ముందు ప్రజలకు మేలు చేసే పనులను చేయాలని పేర్కొన్నారు.దళిత మోర్చా మండల ప్రధాన కార్యదర్శి గాజుల అజయ్,ఓబీసీ మోర్చా అధ్యక్షులు దుర్సెట్టి రమేష్, బొడ్డు అశోక్,బీజేవైఎం జిల్లా ఈసీ బండి సాగర్,వేల్పుల ఓదయ్య,ఆవుల వేణు యాదవ్,కూన సంపత్, అవుదుర్తి సాయి,కామెర శ్రీనివాస్, అవుదుర్తి హరి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.