18-02-2025 12:00:00 AM
ప్రభుత్వం మారినా నిరుద్యోగులకు నిరాశే..
భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 17 (విజయక్రాంతి): గత పాలకులు పట్టించు కోలేదు.. ప్రస్తుత ప్రభుత్వం అమలు చేయడం లేదు.. పరీక్షలు రాసి ఆరేళ్లు.. మెరిట్ లిస్టు ప్రకటించి, సర్టిఫికెట్లు సైతం పరిశీలించి మూడేళ్లు.. చివరికి కోర్టు ఆదేశించినా తమకు ఉద్యోగ భాగ్యం దక్కడం లేదని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వైద్యారోగ్యశాఖలో రాష్ర్టవ్యా ప్తంగా ఖాళీగా ఉన్న 3,311స్టాఫ్ నర్సుల నియామకానికి 2017 నవంబర్‌లో బీఆర్ ఎస్ ప్రభుత్వం టీఎస్ పీఎస్‌సీ ద్వారా నోటిఫికేషన్ విడుదల చేసింది. వేల సంఖ్య లో అభ్యర్ధులు దరఖాస్తు చేశారు. 2018 మార్చి11న టీఎస్‌పీఎస్‌సీ వారికి రాత పరీక్షలు నిర్వహించారు.
సుదీర్ఘకాలం తర్వాత 2021లో అభ్యర్థుల మెరిట్ లిస్టు ప్రకటించి, సర్టిఫికెట్లు పరిశీలన చేసిశారు. మొత్తం 3,311 పోస్టులకు గాను 3,140 మందిని అరత కల్గిన అభ్యర్థులుగా ప్రక టించారు. వారిలో 2,148 మంది పోస్టింగ్ పొందారు. మిగిలిన 722 మంది వె ఆప్షన్ పూర్తిచేసి, జో కూడా పూర్తి చేసిన ప్రభుత్వం.. పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టింది.
కోర్టును ఆశ్రయించిన అర్హులు..
పోస్టులు ఇవ్వకపోవడానికి కార ణం నిధుల లేమి అని టీఎస్‌పీఎస్సీ సాకు చూపింది. నిరుద్యోగులు అప్పటి ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావును కలిసి విన్న వించుకొనే ప్రయత్నం చేయగా, ఆయన వారిపట్ల దురుసుగా ప్రవర్తించినట్టు తెలుస్తోంది. దీంతో కొంత మంది అభ్య ర్థులు కోర్టును ఆశ్రయించారు.
మూడేళ్లుగా కోర్టులో ఇరువర్గాల వాదలను విన్న తర్వాత 2024లో అభ్యర్థులకు అనుకూ లంగా తీర్పు ఇచ్చింది. (డబ్ల్యు ఎ874/2024) అప్పట్లో భర్తీ చేయగా మిగిలిపోయిన 893 పోస్టుల్లో సర్టిఫికెట్ పరిశీలన పూర్తి అయిన అభ్యర్థులతో భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.
గాంధీభవన్ సాక్షిగా హామీ..
అయినా, గత ప్రభుత్వం కోర్టు ఆదేశాలను పెడచెవిన పెట్టింది. అప్పట్లో ప్రతిపక్ష హోదాలో ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడి,్డ భట్టి విక్రమార్కని అభ్యర్థులు కలిసి తమ ఆవేదనను వ్యక్తంచేశారు. కోర్టు ఆదేశాలను చూపించారు. తమ ప్రభుత్వం అధికారం లోకి రాగానే న్యాయం చేస్తామని గాంధీ భవన్ సాక్షిగా హామీ ఇచ్చారు.
ప్రభుత్వం వచ్చింది వారిలో ఒకరు ముఖ్యమంత్రి, మరొకరు ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అధికారంలోకి వచ్చి ఏడాదైనా వైద్యశాఖలో ఎంపికైన తమకు పోస్టింగ్ మాత్రం రాలేదని అభ్యర్థులు వాపోతు న్నారు. అభ్యర్థులకు వారు ఇచ్చిన హామీని అమలు చేస్తారా, హైకోర్టు ఆదేశాలను గౌరవిస్తారా? రాజకీయాల్లో ఇలాంటి వాగ్దానాలు షరామామూలే అని సరిపెట్టు కొంటారా వేచి చూడాల్సిందే.